AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC వెబ్‌సైట్‌ సేవలకు అంతరాయం.. రైల్వే ప్రయాణీకుల అవస్థలు

IRCTC ఆన్‌లైన్ ఈ-టికెట్ బుకింగ్ సేవలకు సోమవారం ఉదయం తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటకు పైగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

IRCTC వెబ్‌సైట్‌ సేవలకు అంతరాయం.. రైల్వే ప్రయాణీకుల అవస్థలు
Indian Railway 1[1]
Janardhan Veluru
|

Updated on: Dec 09, 2024 | 12:59 PM

Share

IRCTC ఆన్‌లైన్ ఈ-టికెట్ బుకింగ్ సేవలకు సోమవారం ఉదయం తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటకు పైగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐఆర్‌సీటీసీకి చెందిన వెబ్‌సైట్‌తో పాటు యాప్‌లో రైల్వే టిక్కెట్ల బుకింగ్ కుదరలేదు. టిక్కెట్ల క్యాన్సలేషన్ కూడా సాధ్యంకాలేదు. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలోనే IRCTC వెబ్‌సైట్ నిలిచిపోయింది. దీంతో తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్న లక్షలాది మంది ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురైయ్యారు.

వెబ్‌సైట్‌లో మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయని, అందువల్ల మరో 1 గంట వరకు బుకింగ్ ఉండదని IRCTC ఒక ప్రకటన విడుదల చేసింది. టికెట్ రద్దు చేసుకునేందుకు కస్టమర్ కేర్ నెంబర్ 14646, 0755-6610661, 0755 -4090600 నెంబర్లకు ఫోన్ చేయాలని లేదా etickets@irctc.co.inకు మెయిల్ చేయాలని ఐఆర్‌సీటీసీ ఆ ప్రకటనలో కోరింది.

అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ-టికెట్ బుకింగ్ సేవలను ఐఆర్‌సీటీసీ నిలిపివేయడం పట్ల ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోషల్ మీడియా వేదికలపై తమకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Follow Us
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన