Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Interest Rates Hike: ఆ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏకంగా 9.6 శాతం వడ్డీ.. సీనియర్ సిటిజన్లకు ఇక పండగే

రిటైరయ్యాక వచ్చిన సొమ్ము వారి భవిష్యత్ అవసరాలు అంటే ముఖ్యంగా ఆరోగ్య అవసరాలకు పని చేస్తుందని పొదుపు వైపు మళ్లుతూ ఉంటారు. దీంతో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వంటివి సీనియర్ సిటిజన్లు చేసే డిపాజిట్లపై సాధారణ పౌరులకంటే ఎక్కువ వడ్డీ రేటు అందిస్తారు.

FD Interest Rates Hike: ఆ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏకంగా 9.6 శాతం వడ్డీ.. సీనియర్ సిటిజన్లకు ఇక పండగే
Fixed Deposit
Follow us
Srinu

|

Updated on: May 07, 2023 | 8:30 AM

మన దగ్గర సొమ్ము ఎంత ఉన్నా పొదుపు సూత్రం పాటించాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చేసే పొదుపు భవిష్యత్‌లో మన అవసరాలకు వెన్నుదన్నుగా ఉంటుంది. ఈ విషయం అనుభవం వచ్చే కొద్దీ తెలుస్తోంది. ముఖ్యంగా ఈ విషయంలో రిటైర్ అయ్యిన ఉద్యోగులకు అనుభవం ఉంటుంది . ఎందుకంటే వారు రిటైరయ్యాక వచ్చిన సొమ్ము వారి భవిష్యత్ అవసరాలు అంటే ముఖ్యంగా ఆరోగ్య అవసరాలకు పని చేస్తుందని పొదుపు వైపు మళ్లుతూ ఉంటారు. దీంతో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వంటివి సీనియర్ సిటిజన్లు చేసే డిపాజిట్లపై సాధారణ పౌరులకంటే ఎక్కువ వడ్డీ రేటు అందిస్తారు. ఇటీవల ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా అన్ని బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను గణనీయంగా పెంచాయి. ప్రస్తుతం సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.6 శాతం వడ్డీని అందిస్తున్నట్లు పేర్కొంది. మే 05, 2023 నుంచి అమల్లోకి వచ్చేలా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించినట్లు బ్యాంక్ ప్రతినిధులు పేర్కొన్నారు. బ్యాంక్ 1 నుంచి 5 సంవత్సరాల వ్యవధి ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 49 నుంచి 160 బేసిస్ పాయింట్లు పెంచింది. సవరణ తర్వాత ఎస్ఎస్ఎఫ్‌బీ సాధారణ పౌరుల నుంచి 4.00 శాతం నుంచి 9.10 శాతం వడ్డీ రేటుతో 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూరయ్యే రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లను స్వీకరించడం ప్రారంభించింది. సీనియర్ సిటిజన్లకు, రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై కొత్త రేట్లు 4.50 శాతం నుంచి 9.60 శాతం వరకు వడ్డీ అందిస్తున్నట్లు పేర్కొంది. రెగ్యులర్ కస్టమర్లు ఇప్పుడు 5 సంవత్సరాల డిపాజిట్లపై 9.10 శాతం వడ్డీని పొందవచ్చని, సీనియర్ సిటిజన్లు 9.60 శాతం వడ్డీ రేటును పొందవచ్చని ఆ ప్రకటనలో బ్యాంక్ తెలిపింది.

పెరిగిన వడ్డీ రేట్లు ఇలా

1 సంవత్సరం ఎఫ్‌డీ: బ్యాంక్ సాధారణ కస్టమర్‌లకు 6.85% వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్‌లకు 7.35% వడ్డీని అందిస్తోంది.

2 సంవత్సరాల ఎఫ్‌డీ: బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 8.5% వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 9% వడ్డీని అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

999 రోజుల ఎఫ్‌డీ: బ్యాంక్ సాధారణ కస్టమర్‌లకు 9 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్‌లకు 9.5% వడ్డీని అందిస్తోంది.

3 సంవత్సరాల ఎఫ్‌డీ: బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 7.25% వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీని అందిస్తోంది.

4 సంవత్సరాల ఎఫ్‌డీ : బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 6.75% వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 7.25% వడ్డీని అందిస్తోంది.

5 సంవత్సరాల ఎఫ్‌డీ: సాధారణ కస్టమర్లకు 9.1% వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 9.6% వడ్డీని అందిస్తోంది.

6 సంవత్సరాల ఎఫ్‌డీ: సాధారణ కస్టమర్లకు 7.25% వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీని అందిస్తోంది.

7 సంవత్సరాల ఎఫ్‌డీ: సాధారణ కస్టమర్లకు 7.25% వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీని అందిస్తోంది.

8 సంవత్సరాల ఎఫ్‌డీ: బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 7.25% వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీని అందిస్తోంది.

9 సంవత్సరాల ఎఫ్‌డీ: బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 7.25% వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీని అందిస్తోంది.

10 సంవత్సరాల ఎఫ్‌డీ: బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 7.25% వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీని అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?