Investment On Mutual Funds: సీనియర్ సిటిజన్లకు అలెర్ట్.. మ్యూచువల్ ఫండ్స్‌ విషయంలో నష్టాలేంటో? తెలుసా?

సీనియర్ సిటిజన్ల కోసం విస్తృత శ్రేణి పెట్టుబడి, పొదుపు పథకాలు ఉన్నప్పటికీ, మ్యూచువల్ ఫండ్‌లు పెట్టుబడిదారులకు అనుకూలమైన ప్రసిద్ధ పెట్టుబడి ఎంపికగా కనిపిస్తాయి. సీనియర్ సిటిజన్లకు అవి మంచివేనా? అని అనుమానం వేధిస్తూ ఉంటుంది. సీనియర్ సిటిజన్లు రిస్క్‌లను అర్థం చేసుకుని ఆర్థిక సలహాదారుల సూచనలు తీసుకున్న తర్వాత తెలివిగా ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ మంచివని నిపుణులు చెబుతున్నారు.

Investment On Mutual Funds: సీనియర్ సిటిజన్లకు అలెర్ట్.. మ్యూచువల్ ఫండ్స్‌ విషయంలో నష్టాలేంటో? తెలుసా?
Mutual Fund
Follow us

|

Updated on: May 07, 2023 | 9:30 AM

సీనియర్ సిటిజన్లు తమ రిటైర్మెంట్ ద్వారా వచ్చే సొమ్మును సురక్షితంగా ఉంచుకోవడమే పెద్ద ఆందోళనగా ఉంటుంది. ముఖ్యంగా తమ పొదుపులో కొంత భాగాన్ని కాలక్రమేణా మంచి రాబడిని ఇచ్చే, ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంలో సహాయపడే పథకాలలో పెట్టుబడి పెట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. భారతదేశంలోని సీనియర్ సిటిజన్లకు వయస్సు ప్రధాన అడ్డంకిగా ఉంటుందని కాబట్టి వారు తెలివిగా పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యమని పలువురు నిపుణులు సూచిస్తూ ఉంటారు. సీనియర్ సిటిజన్ల కోసం విస్తృత శ్రేణి పెట్టుబడి, పొదుపు పథకాలు ఉన్నప్పటికీ, మ్యూచువల్ ఫండ్‌లు పెట్టుబడిదారులకు అనుకూలమైన ప్రసిద్ధ పెట్టుబడి ఎంపికగా కనిపిస్తాయి. సీనియర్ సిటిజన్లకు అవి మంచివేనా? అని అనుమానం వేధిస్తూ ఉంటుంది. సీనియర్ సిటిజన్లు రిస్క్‌లను అర్థం చేసుకుని ఆర్థిక సలహాదారుల సూచనలు తీసుకున్న తర్వాత తెలివిగా ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ మంచివని నిపుణులు చెబుతున్నారు. సీనియర్ సిటిజన్‌లు మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టాలా? వద్దా? అనేది వారి వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి, లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ స్కీమ్ డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్ పూల్‌గా పని చేస్తుంది. దీని కింద పెట్టుబడిదారుల డబ్బు స్టాక్‌లు, బాండ్‌లు, ఈటీఎఫ్‌లు, డిబెంచర్లు వంటి సెక్యూరిటీలలో ఉంచుతారు. మ్యూచువల్ ఫండ్‌లు మార్కెట్ పనితీరుతో కూడా అనుసంధానమై ఉంటాయి. ఇది బ్యాంక్ డిపాజిట్ల కంటే వేగంగా సంపదను పెంచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అనేక రిస్క్‌లు ఉన్నాయి. వీటి విషయంలో సీనియర్ సిటిజన్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సీనియర్ సిటిజన్ల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే కొన్ని నష్టాలేంటో ఓ సారి తెలుసుకుందాం.

మ్యూచువల్ ఫండ్స్ వల్ల నష్టాలివే

ఫీజులు ఖర్చులు 

మ్యూచువల్ ఫండ్‌లతో అనుబంధించిన ఫీజులు, ఖర్చులు ఒక సంభావ్య ప్రతికూలతగా ఉంటాయి. ఇది మొత్తం రాబడిని తగ్గించే అవకాశం ఉంది.

రాబడికి హామీ 

 మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుంచి వచ్చే రాబడికి హామీ లేదు. ముఖ్యంగా మార్కెట్ అస్థిరత ద్వారా ఇవి ప్రభావితం కావచ్చు. ఈక్విటీ ఫండ్ రాబడులు స్వల్పకాలంలో అస్థిరంగా ఉంటాయని నిపుణుల వాదన

ఇవి కూడా చదవండి

నిర్దిష్ట పన్ను రాయితీ 

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల సీనియర్ సిటిజన్లకు నిర్దిష్ట పన్ను రాయితీలు లేవు.

టైమ్ జోన్

మ్యూచువల్ ఫండ్‌లు సాధారణంగా పెట్టుబడి కాలం ఎక్కువగా ఉన్నప్పుడు మంచి రాబడిని ఇస్తాయి. అయితే, మీరు దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేసినా రాబడులకు హామీ ఉండదు. 

అర్థం చేసుకోవడం కష్టం

కొన్ని మ్యూచువల్ ఫండ్‌లు సంక్లిష్టంగా ఉంటాయి. పెట్టుబడి వ్యూహం, రిస్క్‌లను పూర్తిగా అర్థం చేసుకోవడం సీనియర్ సిటిజన్‌లకు కష్టంగా ఉంటుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి