Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Funds Deadline : మదుపరులకు అలర్ట్.. 31 లోపు ఆ పని చేయకపోతే డీ మ్యాట్ ఖాతా ఇన్‌‌యాక్టివ్

పెట్టుబడి పెట్టే వారు కచ్చితంగా డీ మ్యాట్ ఖాతా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ ఖాతా తీసుకునే సమయంలో కొంతమంది సరైన వివరాలు పొందుపరచరు. ముఖ్యంగా నామినేషన్ వివరాల విషయంలో కొద్దిగా అలసత్వం చూపుతారు. ఎందుకంటే నామినీ వ్యక్తి వ్యక్తిగత వివరాలు అందుబాటులో లేకపోవడం వల్ల చాలా ఖాతా సమయంలో నామినీ వివరాలు సరిగ్గా పేర్కొనరు.

Mutual Funds Deadline : మదుపరులకు అలర్ట్.. 31 లోపు ఆ పని చేయకపోతే డీ మ్యాట్ ఖాతా ఇన్‌‌యాక్టివ్
Mutual Fund
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Mar 30, 2023 | 9:00 AM

మన పెట్టుబడులకు నమ్మకమైన రాబడి కోసం చాలా మంది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతుంటారు. మనం బతికి ఉన్నప్పుడు నమ్మకమైన రాబడితో పాటు మనం లేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు భరోసాగా ఉంటుందనే నమ్మకంతో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతూ ఉంటాం. ఇలా పెట్టుబడి పెట్టే వారు కచ్చితంగా డీ మ్యాట్ ఖాతా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ ఖాతా తీసుకునే సమయంలో కొంతమంది సరైన వివరాలు పొందుపరచరు. ముఖ్యంగా నామినేషన్ వివరాల విషయంలో కొద్దిగా అలసత్వం చూపుతారు. ఎందుకంటే నామినీ వ్యక్తి వ్యక్తిగత వివరాలు అందుబాటులో లేకపోవడం వల్ల చాలా ఖాతా సమయంలో నామినీ వివరాలు సరిగ్గా పేర్కొనరు. అయితే అలాంటి వారికి షాక్ ఇస్తూ సెబీ ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తాజా నిబంధనల ప్రకారం, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు నామినీ వివరాలను పేర్కొనడానికి మార్చి 31, 2023 చివరి తేదీగా నిర్ణయించింది. గతేడాది జూన్ 15న విడుదల చేసిన సర్క్యులర్‌లో, సెబీ గత ఏడాది ఆగస్టు 1 నాటికి ఉమ్మడిగా నిర్వహించిన వాటితో సహా ప్రస్తుత మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు నామినేషన్‌ను తప్పనిసరి చేసింది. కొత్త మ్యూచువల్ ఫండ్ యూనిట్ హోల్డర్లు ఇప్పుడు నామినేషన్ ఫారమ్‌ను సమర్పించడం లేదా నామినేషన్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడం తప్పనిసరి అని సెబీ పేర్కొంది. అయితే మొదట్లో ఈ నిర్ణయాన్ని లైట్ తీసుకున్న అక్టోబర్ 2022 గడవును పట్టించుకోలేదు. అలాగే ప్రస్తుతం సెబీ సమయాన్ని పొడిగిస్తుందనే ఆలోచనలో ఉన్నారు. కానీ అలాంటి వారికి షాక్ ఇస్తూ గడవును మాత్రం మళ్లీ పెంచకుండా మార్చి 31నే గడువుగా పేర్కొంది. అలాగే గడవులోపు నామినీ వివరాలను అప్‌డేట్ చేయకపోతే డీ మ్యాట్ ఖాతా ఇన్‌యాక్టివ్ అవుతుందని హెచ్చరించింది.

ట్రేడింగ్ ఖాతాదారులకు మాత్రం ఊరట

ప్రస్తుతం ఉన్న ట్రేడింగ్ డీ మ్యాట్ ఖాతాదారులు నామినేషన్ ఎంపిక లేదా నామినేషన్ నుంచి వైదొలగడానికి గడువును సెప్టెంబర్ చివరి వరకు పొడిగించినట్లు సెబీ తెలియజేసింది . అంతకుముందు వారిక కూడా మార్చి 31, 2023గా గడవుగా పేర్కొంది. వ్యాపారులు/పెట్టుబడిదారులు వారి అకాల మరణం తర్వాత చేసిన పెట్టుబడులు వారి నామినీ(ల)కి బదిలీ చేయాలి కాబట్టి, నామినీ వివరాలను పేర్కొనడం చాలా ముఖ్యం అని గమనించాలి. యూనిట్‌హోల్డర్‌లు తమ నామినీలను ఎంచుకోవడానికి లేదా నామినేషన్ నుంచి వైదొలగడానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సదుపాయాన్ని అందించాలని అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలను సెబీ ఆదేశించింది. ఇప్పటికే తమ నామినేషన్ వివరాలను సమర్పించిన పెట్టుబడిదారులు తమ నామినేషన్ వివరాలను మళ్లీ సమర్పించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే, తమ నామినేషన్ వివరాలను సమర్పించని పెట్టుబడిదారులు స్టాక్ బ్రోకర్లు/డిపాజిటరీ పార్టిసిపెంట్స్ సేవలను అందించే తమ ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించి టూ-ఫాక్టర్ అథెంటికేషన్ను ఉపయోగించి అదే విధంగా చేసే అవకాశం కల్పించింది. ముఖ్యంగా పెట్టుబడిదారులు తమ నామినీ వివరాలను కూడా ఏఎంసీ, రిజిస్ట్రార్ లేదా బదిలీ ఏజెంట్లకు ఒక ఫారమ్‌లో సమర్పించవచ్చని పేర్కొంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాలేజ్‌ క్యాంపస్‌లో తిరుగుతున్న భారీ మొసలి వీడియో వైరల్
కాలేజ్‌ క్యాంపస్‌లో తిరుగుతున్న భారీ మొసలి వీడియో వైరల్
ఇదేం చేస్తుందిలే అని చీప్‌గా చూసేరు.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం..
ఇదేం చేస్తుందిలే అని చీప్‌గా చూసేరు.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం..
ఆరుగురు హీరోయిన్స్ తర్వాత విజయ్ సినిమాలో ఆమె ఫిక్స్ అయ్యిందా..?
ఆరుగురు హీరోయిన్స్ తర్వాత విజయ్ సినిమాలో ఆమె ఫిక్స్ అయ్యిందా..?
మీ మతిమరుపునకు అసలు కారణం తెలిస్తే.. వీడియో
మీ మతిమరుపునకు అసలు కారణం తెలిస్తే.. వీడియో
సంగారెడ్డిలో ఘోరం..ముగ్గురు పిల్లల‌కు విష‌మిచ్చి తానూ తాగిన తల్లి
సంగారెడ్డిలో ఘోరం..ముగ్గురు పిల్లల‌కు విష‌మిచ్చి తానూ తాగిన తల్లి
ఈ పండు తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. వీడియో
ఈ పండు తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. వీడియో
అమెరికా వెళ్లాలనుకునే విద్యార్ధులకు షాక్‌.. ట్రంప్ ఏం చేశారంటే?
అమెరికా వెళ్లాలనుకునే విద్యార్ధులకు షాక్‌.. ట్రంప్ ఏం చేశారంటే?
ముల్లును ముల్లుతోనే తీయాలి.. తూర్పు లద్దాఖ్‌లో అధునాతన బలగాలు
ముల్లును ముల్లుతోనే తీయాలి.. తూర్పు లద్దాఖ్‌లో అధునాతన బలగాలు
పంత్ ఆటపై కోపంతో లైవ్ షోలో టీవీ పగలగొట్టిన యాంకర్
పంత్ ఆటపై కోపంతో లైవ్ షోలో టీవీ పగలగొట్టిన యాంకర్
అమ్మాయి మనసుని అబ్బాయి ఎలా గెలుచుకోవాలో తెలుసా..
అమ్మాయి మనసుని అబ్బాయి ఎలా గెలుచుకోవాలో తెలుసా..