AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Funds: అలర్ట్… మార్చి 31లోగా ఈ పని చేయకపోతే మీ మ్యూచువల్ ఫండ్ ఖాతా డీయాక్టీవ్ అయిపోవడం ఖాయం..

మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారా, అయితే మీరు మార్చి 31, 2023లోగా ఒక ముఖ్యమైన పని చేయకపోతే, మీ మ్యూచువల్ ఫండ్ ఖాతా స్తంభింపచేస్తామని సెబీ ప్రకటించింది.

Mutual Funds: అలర్ట్... మార్చి 31లోగా ఈ పని చేయకపోతే మీ మ్యూచువల్ ఫండ్ ఖాతా డీయాక్టీవ్ అయిపోవడం ఖాయం..
Mutual Fund
Madhavi
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 25, 2023 | 1:57 PM

Share

మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారా, అయితే మీరు మార్చి 31, 2023లోగా ఒక ముఖ్యమైన పని చేయకపోతే, మీ మ్యూచువల్ ఫండ్ ఖాతా స్తంభింపచేస్తామని సెబీ ప్రకటించింది. రెగ్యులేటరీ మార్గదర్శకాల ప్రకారం పెట్టుబడిదారులు తమ ఫండ్ ఫోలియోల కోసం తమ నామినీని పేర్కొనాలి. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి నామినీ నుండి వైదొలగాలనుకుంటున్నారా లేదా అని ఫండ్ హౌస్‌కు తెలియజేయాలి. మ్యూచువల్ ఫండ్ నామినీ ‌కు సంబంధించిన పూర్తివివరాలను తెలుసుకుందాం.

మ్యూచువల్ ఫండ్ నామినీ అంటే ఏమిటి?

మ్యూచువల్ ఫండ్స్ ను బ్యాంకు ఖాతా తరహాలోనే డీమ్యాట్ ఖాతాలో భద్రపరుస్తారు. అయితే ఈ ఖాతాకు నామినీ అవసరం. ఎందుకుంటే నామినీ పేరు ఎంటర్ చేయడం ద్వారా మీరు మరణించిన సందర్భంలో, ఖాతా డబ్బు తీసుకోవడానికి ఒక వ్యక్తిని నామినేట్ చేయాలి. కొత్తగా డీమాట్ అకౌంట్ ప్రారంభించే వారిరి నామినీ పేర్కొనడం తప్పనిసరి. గతంలో నామినీ ఎంటర్ చేయని వారు ఈ నెల 31లోగా నామినీ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నామినీ వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

నామినీ నమోదు చేయబడినప్పుడు, పెట్టుబడిదారుడు మరణించిన సందర్భంలో నామినీకి నిధులను సులభంగా బదిలీ చేయడంలో ఇది సహాయపడుతుంది. నామినీ హాజరు కానట్లయితే, వారసుడు లేదా క్లెయిమ్ చేయాలనుకునే వ్యక్తి వీలునామా, చట్టపరమైన వారసుడి సర్టిఫికేట్, ఇతర చట్టపరమైన వారసుల నుండి NOC వంటి పత్రాలను తీసుకురావాలి. దీని తరువాత మాత్రమే వారు ఈ యూనిట్లను వారి పేరు మీద పొందగలరు.

మార్చి 31 గడువులోగా మీరు దీన్ని చేయకపోతే ఏమి జరుగుతుంది?

మీ ప్రస్తుత ఫోలియోలో మీరు నామినీ చేయకుంటే, ఫోలియో స్తంభింపజేయబడుతుంది, అంటే పెట్టుబడిదారులు పెట్టుబడులను మార్చలేరు లేదా రీడీమ్ చేయలేరు.

నామినీని ఎలా ఎంటర్ చేయాలి?

ఒకవేళ మీరు ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా అకౌంట్ తెరిచి, నామినీని అప్‌డేట్ చేయనట్లయితే, మీరు నామినీ ఫారమ్‌ను పూరించి, సంతకం చేసి, రిజిస్ట్రార్‌కు సమర్పించడం ద్వారా అలా చేయవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో మ్యూచువల్ ఫండ్ ఖాతాను తెరిచి ఉంటే, మీ మ్యూచువల్ ఫండ్ స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేయండి ఫోలియోలో నామినీ పేర్కొనబడిందో లేదో చూడండి.

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు తమ నామినీ ‌వివరాలను రెండు రకాలుగా సమర్పించవచ్చు. ఒకటి ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా నామినీ వివరాలను ఒక ఫారమ్‌పై పూరించి, దానిపై సంతకం చేసి, ఆపై రిజిస్ట్రార్ లేదా ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ లేదా మ్యూచువల్ ఫండ్ హౌస్‌కు సమర్పించాలి. లేదా ఆన్ లైన్ ద్వారా మీ డీమ్యాట్ ఖాతాలోకి వెళ్లి నమోదు చేయాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి