AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Interest Rates Hike: ఖాతాదారులకు ఆ బ్యాంక్ శుభవార్త… సీనియర్ సిటిజన్లకు ఏకంగా 8.25 శాతం వడ్డీ..

ప్రతి బ్యాంకు తమ ఖాతాదారుల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లను స్వీకరిస్తుంది. అలాగే మంచి వడ్డీ రేట్లతో మన పెట్టుబడికి లాభాన్ని ఇస్తాయి. కాబట్టి అందరకూ ఫిక్స్డ్ డిపాజిట్లల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు.

FD Interest Rates Hike: ఖాతాదారులకు ఆ బ్యాంక్ శుభవార్త… సీనియర్ సిటిజన్లకు ఏకంగా 8.25 శాతం వడ్డీ..
Fixed Deposit
Nikhil
|

Updated on: May 03, 2023 | 5:45 PM

Share

కష్టపడి సంపాదించిన సొమ్మును ప్రతి ఒక్కరూ నమ్మకమైన రాబడి కోసం వివిధ పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. అయితే పెట్టుబడి అనే విషయంలో మనస్సులోకి వచ్చినప్పడు ప్రతి ఒక్కరూ ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రతి బ్యాంకు తమ ఖాతాదారుల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లను స్వీకరిస్తుంది. అలాగే మంచి వడ్డీ రేట్లతో మన పెట్టుబడికి లాభాన్ని ఇస్తాయి. కాబట్టి అందరకూ ఫిక్స్డ్ డిపాజిట్లల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. బ్యాంకులు కూడా పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఆర్‌బీఐ తీసుకున్న చర్యలతో ప్రముఖ బ్యాంక్ యస్ బ్యాంక్ కూడా వినియోగదారులకు భారీ వడ్డీని అందిస్తామని పేర్కొంది. 2 కోట్ల లోపు డిపాజిట్లపై యస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. ఇప్పుడు యస్ బ్యాంక్ సాధారణ పౌరులకు 3.25% నుంచి 7.75% మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు యస్ బ్యాంక్ 3.75% నుంచి 8.25% వరకూ ఆఫర్ చేస్తుంది. యస్ బ్యాంక్ ఇచ్చే వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో? ఓ సారి చూద్దాం.

యస్ బ్యాంక్ ప్రస్తుతం 7 నుంచి 14 రోజుల్లో మెచ్యూరయ్యే దేశీయ టర్మ్ డిపాజిట్లపై, బ్యాంక్ ఇప్పుడు 3.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అయితే యస్ బ్యాంక్ ఇప్పుడు 15 నుంచి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే దేశీయ టర్మ్ డిపాజిట్లపై 3.70 శాతం వడ్డీ రేటు, అలాగే 46 రోజుల నుంచి 90 రోజుల వరకు 4.10 శాతం, 91 రోజుల నుంచి 180 రోజుల వరకు 4.75 శాతం చొప్పున డిపాజిట్లపై వడ్డీ రేట్లను అందిస్తోంది. అలాగే 181 నుంచి 271 రోజులలో మెచ్యూరయ్యే డిపాజిట్లపై ఇప్పుడు 6.00 శాతం వడ్డీ లభిస్తుంది. అయితే 272 నుండి 1 సంవత్సరంలో మెచ్యూరయ్యే డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ పద్దెనిమిది నెలల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 7.50 శాతం, పద్దెనిమిది నెలల నుంచి మూడు సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే వాటికి 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 36-120 నెలల మధ్య మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై 7 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 18 నెలల నుంచి 36 నెలల లోపు కాలవ్యవధిపై బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటు 8.25 శాతం వరకూ వడ్డీని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..