Bank of India FD: సీనియర్ సిటిజెన్లకు ‘శుభారంభం’.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మరెక్కడా లేని అత్యధిక వడ్డీ.. త్వరపడండి..

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. శుభ్ ఆరంభ్ డిపాజిట్లకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. దీనిలో సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 7.80శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 7.65శాతం వడ్డీ అందిస్తున్నట్లు వివరించింది.

Bank of India FD: సీనియర్ సిటిజెన్లకు ‘శుభారంభం’.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మరెక్కడా లేని అత్యధిక వడ్డీ.. త్వరపడండి..
Bank Fd
Follow us

|

Updated on: Apr 28, 2023 | 3:50 PM

కచ్చితమైన రాబడికి అభయమిచ్చి.. అధిక వడ్డీతో పాటు ప్రభుత్వ భరోసా లభించే ఫిక్స్‌డ్ డిపాజిట్లు(ఎఫ్‌డీ) అంటే ప్రజలకు మక్కువ ఎక్కువ. వినియోగదారులు పెద్ద ఎత్తున ఫిక్స్‌డ్ డిపాజిట్ లలో పెట్టుబడులు పెడతారు. అందుకనుగుణంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు పలు ఆఫర్లు, అధిక వడ్డీలు అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తాయి. ఇదే క్రమంలో ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. ప్రత్యేకంగా రూపొందించిన శుభ్ ఆరంభ్ డిపాజిట్లకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. పెంచిన వడ్డీ రేట్లు 2023, ఏప్రిల్ 1 నుంచే అమలులోకి వచ్చినట్లు పేర్కొంది. దీనిలో పెట్టుబడిపై సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 7.80శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 7.65శాతం వడ్డీ అందిస్తున్నట్లు వివరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సూపర్ సీనియర్ సిటిజన్లకు..

సూపర్ సీనియర్ సిటిజన్లు అంటే 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఈ స్కీమ్ లో అధిక ప్రయోజనం చేకూరుతుంది. వీరికి 7.80శాతం వడ్డీ 501 రోజుల ఫిక్స్ డ్ డిపాజిట్ పై వస్తుంది. అదే 60 నుంచి 80 ఏళ్ల వారికి 7.65శాతం వడ్డీ అదే టెన్యూర్ పై బ్యాంకు అందిస్తోంది. అంటే సూపర్ సీనియర్ సిటిజన్లకు 0.15 శాతం అదనంగా వడ్డీ రేటు వస్తుంది. మరోవైపు.. 7 రోజుల నుంచి 10 ఏళ్ల టెన్యూర్ కలిగిన ఇతర టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 3 శాతం నుంచి 6.75 శాతం వరకు సాధారణ కస్టమర్లకు ఆఫర్ చేస్తుండగా.. సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.40 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. సవరించిన వడ్డీ రేట్లు డొమెస్టిక్, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ డిపాజిట్లకు వర్తిస్తాయని బ్యాంక్ తెలిపింది. అయితే, డిపాజిట్లు 6 నెలలు అంతకన్నా ఎక్కువ టెన్యూర్ ఉన్న వాటిపైనే సీనియర్ సిటిజన్లు, ఎక్స్ స్టాఫ్ సీనియర్లుకు అదనంగా వడ్డీ రేట్లు వర్తిస్తాయని పేర్కొంది. డిపాజిట్ చేసే సమయానికి వారి వయసు 60 ఏళ్లు దాటి ఉండాలని స్పష్టం చేసింది

ఇవి కూడా చదవండి
  • 7 రోజుల నుంచి 45 రోజుల టెన్యూర్‌పై 3 శాతం వడ్డీ ఇస్తోంది.
  • 46 రోజుల నుంచి 179 రోజుల టెన్యూర్ డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీ ఇస్తోంది.
  • 180 రోజుల నుంచి 269 రోజులకు 5 శాతం, 270 రోజుల నుంచి ఏడాది వరకు 5.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
  • ఏడాది నుంచి రెండేళ్లలోపు (501 రోజులు మినహాయించి) 6 శాతం
  • 501 రోజుల స్పెషల్ డిపాజిట్లకు 7.15 శాతం వడ్డీ ఇస్తోంది.
  • 2 ఏళ్ల నుంచి మూడేళ్లలోపు 6.75 శాతం, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు 6.50 శాతం , 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లలోపు 6 శాతం వడ్డీ ఇస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
తొలి 2 బంతుల్లో భారీ సిక్స్‌లు.. భయపడిన సచిన్ కుమారుడు..
తొలి 2 బంతుల్లో భారీ సిక్స్‌లు.. భయపడిన సచిన్ కుమారుడు..
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? పాన్ ఇండియా సూపర్ స్టార్
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? పాన్ ఇండియా సూపర్ స్టార్
ఈ ఆకులు తీసుకుంటే.. యూరిక్ యాసిడ్ సమస్య మాయం అవ్వడం ఖాయం!
ఈ ఆకులు తీసుకుంటే.. యూరిక్ యాసిడ్ సమస్య మాయం అవ్వడం ఖాయం!
పోలీసులపై చింతమనేని దౌర్జన్యం.. ఈ సెక్షన్ల కింద 94వ కేసు నమోదు..
పోలీసులపై చింతమనేని దౌర్జన్యం.. ఈ సెక్షన్ల కింద 94వ కేసు నమోదు..
భూవివాదంలో మాజీ మంత్రి.. పోలీసుల అదుపులో మల్లారెడ్డి
భూవివాదంలో మాజీ మంత్రి.. పోలీసుల అదుపులో మల్లారెడ్డి
పైకి చూస్తే అదొక గుడిసె.. కానీ లోపలకెళ్లి చూడగా మతిపోవాల్సిందే.!
పైకి చూస్తే అదొక గుడిసె.. కానీ లోపలకెళ్లి చూడగా మతిపోవాల్సిందే.!
ఇలా చేశారంటే.. హిమోగ్లోబిన్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి!
ఇలా చేశారంటే.. హిమోగ్లోబిన్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి!
ప్రకాష్ రాజ్ మొదటి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
ప్రకాష్ రాజ్ మొదటి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
ఆర్‌సీబీకి కలిసొచ్చిన 'నెంబర్ 18' సెంటిమెంట్.. అదేంటంటే?
ఆర్‌సీబీకి కలిసొచ్చిన 'నెంబర్ 18' సెంటిమెంట్.. అదేంటంటే?
డబ్బులు డబుల్ చేసి ఆశ చూపిన నేరగాళ్లు.. ఆపై ఏం చేశారంటే..
డబ్బులు డబుల్ చేసి ఆశ చూపిన నేరగాళ్లు.. ఆపై ఏం చేశారంటే..