AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Laddering: చిట్కా చిన్నదే.. కానీ ప్రయోజనం మాత్రం రూ. లక్షల్లో.. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకొనేవారు ఇది మిస్ అవ్వొద్దు..

ఒకసారి ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన మొత్తం మెచ్యూరిటీ పీరియడ్ అయ్యే వరకూ లాక్ అయి ఉంటాయి. మీకు మధ్యలో ఏదైనా అత్యవసరం అయ్యి డబ్బు అవసరం అయితే తిరిగి తీసుకొనే వీలుండదు. అయితే మీరు ఓ స్ట్రాటజీని వినియోగించడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు.

FD Laddering: చిట్కా చిన్నదే.. కానీ ప్రయోజనం మాత్రం రూ. లక్షల్లో.. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకొనేవారు ఇది మిస్ అవ్వొద్దు..
Fixed Deposit
Madhu
|

Updated on: Apr 28, 2023 | 5:30 PM

Share

ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయ్యాయి. స్థిరమైన రాబడి వస్తుందన్న నమ్మకంతో వినియోగదారులు వీటిపై అధికంగా పెట్టుబడి పెడుతున్నారు. బ్యాంకులు కూడా అనేక రకాల ఫీచర్లు, మంచి వడ్డీ రేట్లు అమలు చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఒకసారి ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన మొత్తం మెచ్యూరిటీ పీరియడ్ అయ్యే వరకూ లాక్ అయి ఉంటాయి. మీకు మధ్యలో ఏదైనా అత్యవసరం అయ్యి డబ్బు అవసరం అయితే తిరిగి తీసుకొనే వీలుండదు. కొన్ని బ్యాంకులు ప్రీ మెచ్యూర్ విత్ డ్రాల్ పై పెనాల్టీలను విధిస్తాయి. అయితే మీరు ఓ స్ట్రాటజీని వినియోగించడం ద్వారా ఇటువంటి అత్యవసర పరిస్థితులను అధిగమించడంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. ఆ స్ట్రాటజీ పేరే ఎఫ్‌డీ ల్యాడరింగ్. అసలు ఎఫ్‌డీ ల్యాడరింగ్ అంటే ఏమిటి? దానిని ఎలా వినియోగించాలి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎఫ్‌డీ ల్యాడరింగ్ అంటే..

ఎఫ్‌డీ ఇన్వెస్ట్‌మెంట్‌ను వివిధ టెన్యూర్స్‌లో మెచ్యూర్‌ అయ్యే చిన్న చిన్న ఎఫ్‌డీలలో ఇన్వెస్ట్‌ చేయడాన్ని ఎఫ్‌డీ ల్యాడరింగ్‌ అంటారు. ఇది లిక్విడిటీ అవసరాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్న సమయంలో మెరుగైన లాభాలను అందుకునే అవకాశం కల్పిస్తుంది.

ఉదాహరణకు ఓ వ్యక్తి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లో రూ.15,000 ఇన్వెస్ట్‌ చేయాలని అనుకున్నారనుకోండి. ఈ మొత్తం ఉపయోగించి మూడు వేర్వేరు ఎఫ్‌డీ అకౌంట్‌లు ఓపెన్‌ చేయాలి. రూ.15,000ని మూడు భాగాలుగా విభజించి ఒక్కొక్క దానిలో రూ.5000 వంతున ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలి. మూడు అకౌంట్‌ల మెచ్యూరిటీ పీరియడ్‌ వరుసగా 12 నెలలు, 24నెలలు, 36 నెలలు ఉండేలా చూసుకోవాలి. బ్యాంక్ అందించే వడ్డీ రేట్ల ప్రకారం టెన్యూర్‌ ఉండాలి. తక్కువ వడ్డీకి తక్కువ టెన్యూర్‌ ఉండేలా, ఎక్కువ వడ్డీకి ఎక్కువ కాలం మెచ్యూరిటీ పీరియడ్‌ ఉండేలా చూసుకోవాలి. టెన్యూర్‌, వడ్డీ ప్రకారం పెట్టుబడి పెట్టాలి.

ఇవి కూడా చదవండి

ఇలా మేనేజ్ చేయొచ్చు..

లిక్విడిటీని మ్యానేజ్‌ చేయడానికి రూ.10 లక్షలను ఒకే ఎఫ్‌డీలో ఇన్వెస్ట్ చేయడం కంటే.. ఐదు భాగాలుగా విభజించి, వివిధ టెన్యూర్స్‌లో మెచ్యూర్‌ అయ్యేలా రూ.2 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఏదైనా అవసరాలకు డబ్బు అవసరమైనప్పుడు, ప్రీ మెచ్యూర్‌గా విత్‌డ్రా చేయాల్సి వస్తే ఒక్క చిన్న ఎఫ్‌డీని తీసుకుంటే సరిపోతుంది. మిగతా ఎఫ్‌డీల ఆదాయంపై ఎలాంటి ప్రభావం కనిపించదు. ఎఫ్‌డీ ల్యాడర్‌ని సెలక్ట్‌ చేసుకున్న తర్వాత వడ్డీల పెరుగుదల, తగ్గుదల గురించి ఆందోళన అవసరం లేదు. వివిధ రేట్లు కలిగిన ప్రత్యేక ఎఫ్ డీ లు వివిధ కాలాల్లో మెచ్యూర్‌ అవుతాయి కాబట్టి, లభించే వడ్డీని యావరేజ్‌ చేసుకోవాలి. ఎఫ్‌డీ ల్యాడర్‌ ప్లాన్‌ అమలు చేసినప్పుడు సాధారణ లిక్విడిటీ అవకాశాలతోపాటు విభిన్న వడ్డీ రేట్లు నుంచి ప్రయోజనాలు అందుకుంటారు.

అత్యవసరం అయిన వేళ ఉపయుక్తం..

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసందర్భంలో ఊహించని విధంగా అవసరాలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా మెడికల్ బిల్లులు, అదనపు ఈఎంఐ వంటి వి అకస్మాత్తుగా మీద పడొచ్చు. అటువంటి సమయంలో ఇలా వివిధ అకౌంట్లలో ఎఫ్డీలను విభాగిస్తే మేలు జరుగుతుంది. ఎదోక ఎఫ్ డీని క్లోజ్ చేసి మీ అవసరాలకు వినియోగించుకోవచ్చు. అలాగే ఏడాది ఒక ఎఫ్డీ మెచ్యూరిటీకి వస్తుంది కాబట్టి దానిని తిరిగి రీ ఇన్ వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు కూడా ఎఫ్ డీ లపై పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..