AERA EV Bike: మార్కెట్‌లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇంటికే డెలివరీ..
ఈవీ వాహనాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువ చేయాలని వివిధ కంపెనీలు తమ డీలర్లను పెంచుకుంటున్నాయి. అలాగే ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి సంస్థల ద్వారా ఆన్‌లైన్‌లో ఈవీ స్కూటర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రస్తుతం ఈవీ స్కూటర్ల వరకే ఉన్న ట్రెండ్‌ను తాజాగా ఈవీ బైక్‌లకు కూడా పాకింది. ప్రస్తుతం టెక్ ఇన్నోవేషన్‌కు సంబంధించిన ఈవీ బైక్ వినియోగదారులకు ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉంటుంది.
భారత్‌లో ప్రస్తుతం ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా ప్రజలు పెరుగుతున్న పెట్రో వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఈవీ వాహనాల కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పట్టణ ప్రాంతంలోని ప్రజలు గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే ఎక్కువగా ఈవీ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఈవీ వాహనాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువ చేయాలని వివిధ కంపెనీలు తమ డీలర్లను పెంచుకుంటున్నాయి. అలాగే ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి సంస్థల ద్వారా ఆన్‌లైన్‌లో ఈవీ స్కూటర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రస్తుతం ఈవీ స్కూటర్ల వరకే ఉన్న ట్రెండ్‌ను తాజాగా ఈవీ బైక్‌లకు కూడా పాకింది. ప్రస్తుతం టెక్ ఇన్నోవేషన్‌కు సంబంధించిన ఈవీ బైక్ వినియోగదారులకు ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. మేటర్ ఏరా పేరుతో రిలీజ్ చేసిన ఈ బైక్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. భారతదేశంలో 25 జిల్లాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. అలాగే ఈ ఈవీ బైక్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో వివిధ ఆఫర్లు, తగ్గింపులు లభిస్తున్నాయి. ప్రస్తుతం మారుతున్న కాలం ప్రకారం వినియోగదారులకు స్పీడ్ డెలివరీ ఇవ్వడానికే తాము ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యులయ్యామని సీఈఓ మోహన్‌లాల్ బాయ్ తెలిపారు. అయితే ఈ మ్యాటర్ ఎరా బైక్‌కు సంబంధించిన ఫీచర్లు ఎలా ఉంటాయో? ఓ సారి తెలుసుకుందాం.
మ్యాటర్ ఎరా ప్రయోజనాలు ఇవే
మ్యాటర్ ఏరా బైక్ 5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 10 కేడబ్ల్యూ మోటార్‌ను ఉత్పత్తి చేయడానికి శక్తినిస్తుంది. ఎలక్ట్రిక్ మోటారును 4-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేసిన మొదటి బైక్ కూడా ఇదే. అంతేకాకుండా సాధారణ ఎయిర్ కూలింగ్‌కు బదులుగా లిక్విడ్ కూలింగ్‌ను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ కూడా ఏరానే మార్కెట్ వర్గాలు చెబతున్నాయి. కాల్ లేదా మెసేజ్ అలర్ట్‌తో బ్లూటూత్ కనెక్టివిటీని పొందే ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అలాగే ఆన్‌బోర్డ్ నావిగేషన్ డిస్‌ప్లే ఈ బైక్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఈ బైక్‌లో పుష్-బటన్ స్టార్ట్‌తో పాటు ఫార్వర్డ్, రివర్స్ అసిస్ట్‌ను కూడా పొందుతుంది. బ్రేకింగ్ డ్యూటీలు డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లతో ఈ బైక్ యూత్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. అలాగే ఈ కామర్స్ యాప్‌లో అమ్మకానికి ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ వాహనం మేటర్ మాత్రమే కాదు అని ఇక్కడ గమనించాలి. కొన్ని కంపెనీలు ఈవీ స్కూటర్లు ఇప్పటికే ఈ కామర్స్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..