Infinix Smart 7 HD: మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్.. తక్కువ ధరల్లో అదరిపోయే ఫీచర్స్..
మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను ఉపయోగించి కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి మొబైల్ తయారీ కంపెనీలు. ఇక తాజాగా Infinix Smart 6 HD విభిన్న మోడల్ మార్కెట్లోకి శుక్రవారం విడుదల చేసింది. అయితే ఈ ఫోన్ లాంచ్ కాకముందే..
మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను ఉపయోగించి కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి మొబైల్ తయారీ కంపెనీలు. ఇక తాజాగా Infinix Smart 7 HD విభిన్న మోడల్ మార్కెట్లోకి శుక్రవారం విడుదల చేసింది. అయితే ఈ ఫోన్ లాంచ్ కాకముందే ఆన్‌లైన్‌లో చాలా సమాచారం లీక్ అయ్యింది. కాగా, కంపెనీ స్వయంగా కొన్ని వివరాలను వెల్లడించింది. వెలువడుతున్న నివేదికల ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Infinix కొత్త Smart 7 HD భారతదేశంలో ఫ్లిప్‌కార్టులో లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.6,000 ఉండనున్నట్లు సమాచారం.
ఇక స్పెసిఫికేషన్‌లు చూస్తే..
ఈ స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ ఉండనుంది. రాబోయే బడ్జెట్ పరికరం 4GB RAM+64GB ఇంటర్నల్ స్టోరేజ్. ఇతర ఫీచర్లు చాలా వరకు Smart 7 మాదిరిగానే ఉండవచ్చు.కెమెరా గురించి చెప్పాలంటే, ఫోన్ 8 MP, AF,QVGA వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీనితో పాటు ఫ్లాష్‌లైట్ కూడా అందుబాటులో ఉంటుంది. ముందు భాగంలో, LED ఫ్లాష్‌తో కూడిన 5 MP 720p@30fps సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా XOS 12లో రన్ అవుతున్నట్లు తెలుస్తోంది. 1,612×720 పిక్సెల్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి