Aadhaar Card Updates: యూఐడీఏఐ కీలక అప్‌డేట్‌.. మీరు ఆధార్‌ కార్డు తీసుకుని 10 ఏళ్లు అయ్యిందా? అయితే ఈ పని వెంటనే చేయాల్సిందే..

మన దేశంలో డాక్యుమెంట్లలో ఆధార్‌ కార్డు చాలా ముఖ్యమైన పత్రం. అయితే చాలా మంది ఆధార్‌ కార్డులోని వివరాలు తప్పుగా ఉన్నాయి. వాటిని సరి చేసుకునేందుకు మీ సేవా కేంద్రాలు, ఆన్‌లైన్‌ సెంటర్లలో తిరుగుతుంటారు. ఆధార్‌లో తప్పులు ఉండటం కారణంగా సమస్యలు వస్తుంటాయి. ఆధార్‌ కార్డు..

Aadhaar Card Updates: యూఐడీఏఐ కీలక అప్‌డేట్‌.. మీరు ఆధార్‌ కార్డు తీసుకుని 10 ఏళ్లు అయ్యిందా? అయితే ఈ పని వెంటనే చేయాల్సిందే..
Aadhaar Card
Follow us

|

Updated on: Apr 27, 2023 | 6:51 PM

మన దేశంలో డాక్యుమెంట్లలో ఆధార్‌ కార్డు చాలా ముఖ్యమైన పత్రం. అయితే చాలా మంది ఆధార్‌ కార్డులోని వివరాలు తప్పుగా ఉన్నాయి. వాటిని సరి చేసుకునేందుకు మీ సేవా కేంద్రాలు, ఆన్‌లైన్‌ సెంటర్లలో తిరుగుతుంటారు. ఆధార్‌లో తప్పులు ఉండటం కారణంగా సమస్యలు వస్తుంటాయి. ఆధార్‌ కార్డు జారీ చేసే సంస్థ యూఐడీఏఐ ఆధార్‌లోని పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్‌ నంబర్‌, లింగం మొదలైన వాటిని మార్పులు చేసుకునే వెలసులుబాటు కల్పించింది యూఐడీఏఐ. అయితే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కార్డులో ప్రతి సమాచారాన్ని పదేపదే మార్పు చేసుకునేందుకు కుదరదు.

ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ బయోమెట్రిక్ అప్‌డేట్‌కు సంబంధించి కీలక సమాచారాన్ని వెల్లడించింది. యూఐడీఏఐ నుంచి అందిన సమాచారం ప్రకారం.. అన్ని రాష్ట్రాలు దాని అధికారిక పరిధిని పెంచాలని కోరింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఒక్కరూ తమ ఆధార్, బయోమెట్రిక్‌లను, ఫోటోను అప్‌డేట్ చేసేలా ప్రోత్సహించాలని యూఐడీఏఐ తెలిపింది. తద్వారా ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌ను అప్‌డేట్‌గా ఉంచుకుంటారు.

  • నమోదు చేసుకునే సమయంలో 5 లేదా 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఫోటోగ్రాఫ్‌ల వంటి బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం.
  • ప్రాథమిక నమోదు సమయంలో పిల్లల వయస్సు 5 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, వారు 5 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తిరిగి నమోదు చేసి ఉండాలి. మొత్తం బయోమెట్రిక్ డేటాను అందించాలి.
  • ఎన్‌రోల్‌మెంట్ సమయంలో పిల్లల వయస్సు 5 – 15 సంవత్సరాల మధ్య ఉంటే, వారు 15 సంవత్సరాలు నిండినప్పుడు అప్‌డేట్‌ కోసం అన్ని బయోమెట్రిక్‌లను అందించాలి.
  • నమోదు సమయంలో 15 ఏళ్లు పైబడిన నివాసితులు, ప్రతి 10 సంవత్సరాలకు వారి బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేయాలని కేంద్రం సిఫార్సు చేసింది.

ఇలా చేయడం ద్వారా ఫేక్ బేసిస్ కూడా అరికట్టబడుతుందని, అలాగే ప్రతి ఒక్కరి డేటా కూడా పూర్తిగా భద్రంగా ఉంటుంద యూఐడీఏఐ డేటా సెక్యురిటీ తెలిపింది. జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఏ వ్యక్తి అయినా ఎంపిక చేసుకున్న ప్రతి పదేళ్లకు బయోమెట్రిక్స్, డెమోగ్రాఫిక్ వివరాలను అప్‌డేట్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆధార్ కార్డ్‌లో ఫోటోను ఎలా అప్‌డేట్ చేయాలి

  1. UIDAI వెబ్‌సైట్- uidai.gov.in/ నుంచి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్/కరెక్షన్/అప్‌డేట్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
  2. ఫారమ్‌ను జాగ్రత్తగా, ఖచ్చితంగా పూరించండి.
  3. సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రం లేదా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించండి.
  4. ఎగ్జిక్యూటివ్‌కు ఫారమ్‌ను సమర్పించండి. అలాగే ధృవీకరణ కోసం మీ బయోమెట్రిక్ వివరాలను అందించండి.
  5. ఎగ్జిక్యూటివ్ మీ ఫోటోను తీసుకుంటారు.
  6. అప్‌డేట్ చేయబడిన వివరాలను ఆమోదించడానికి మీరు మీ బయోమెట్రిక్‌లను మళ్లీ అందించాలి.
  7. ఈ వివరాలు అప్‌డేట్‌ చేసేందుకు మీరు రూ.100 రుసుము (జీఎస్టీతో సహా) చెల్లించాలి.
  8. ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మీరు అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)తో కూడిన రసీదు స్లిప్‌ను అందుకుంటారు.
  9. మీరు UIDAI వెబ్‌సైట్‌లో మీ ఆధార్ అప్‌డేట్ స్థితిని తనిఖీ చేయడానికి URNని ఉపయోగించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..