AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Second Hand Car: సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనుగోలు చేయడం వల్ల ఉపయోగం ఏమిటి?

చాలా మంది కొత్త కారు కొనుగోలు చేసే సామర్థ్యం లేనివారు సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనేందుకు ఆసక్తి చూపుతారు. ఇప్పుడు పాత కారు కొనుక్కోవాలా లేక కాస్త వెయిట్ చేసి కొత్త కారు కొనుక్కోవాలా? దీనికోసం కొంత డబ్బు ఆదా చేసుకోవాలా? అసలు పాత కారు కొనుక్కుంటే మంచిదా? కొత్త కారు కొనుక్కుంటే బెటరా..

Second Hand Car: సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనుగోలు చేయడం వల్ల ఉపయోగం ఏమిటి?
Second Hand Car
Subhash Goud
|

Updated on: Apr 27, 2023 | 5:00 PM

Share

చాలా మంది కొత్త కారు కొనుగోలు చేసే సామర్థ్యం లేనివారు సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనేందుకు ఆసక్తి చూపుతారు. ఇప్పుడు పాత కారు కొనుక్కోవాలా లేక కాస్త వెయిట్ చేసి కొత్త కారు కొనుక్కోవాలా? దీనికోసం కొంత డబ్బు ఆదా చేసుకోవాలా? అసలు పాత కారు కొనుక్కుంటే మంచిదా? కొత్త కారు కొనుక్కుంటే బెటరా అనే అయోమయంలో ఉంటారు కొందరు. తక్కువ బడ్జెట్‌లో మంచి కారు వస్తుంది. ఈ రోజుల్లో సామాన్యులు సైతం కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ రోజుల్లో కనీసం రూ.1.50 లక్షలకు కూడా సెకండ్‌ హ్యాండ్‌ కారు వస్తుంది. అదే పాత కారుపై రుణం తీసుకుని కూడా కొనుగోలు చేస్తున్నారు.

సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయడంలో ఉండే అతి పెద్ద లాభం ఏమిటంటే.. అది తక్కువ ధరలో దొరుకుతుంది. మీరు తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి అయితే, మీ కొద్దిపాటి సేవింగ్స్ తీసుకెళ్ళి కొత్త కారు కోసం ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదు. మీరు సెకండ్ హ్యాండ్ కారుతో కూడా మంచి డీల్ పొందవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. మీరు కొత్త మారుతి స్విఫ్ట్ కొనుగోలు చేయాలనుకుంటే, దాని షోరూమ్ ధర సుమారు 6 లక్షల రూపాయలు. అయితే, సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో, మీరు అదే కారును సగం ధరకు పొందవచ్చు. కొనుగోలు సమయంలో మీరు మరింత బేరం ఆడగలిగితే దానిని మీరు మరింత తక్కువ ధరలో సంపాదించే అవకాశం ఉంటుంది.

మీరు బయటి నుంచి కొత్తగా కనిపించే వాడిన కార్లను కొనడానికి ప్రేతనం చేయవచ్చు. ఈ విధంగా, మీరు డబ్బు ఆదా చేసుకోవచ్చు. అలాగే మీరు కారు వెలుపలి వైపు ఎలా ఉండాలని అనుకుంటున్నారో అలాంటి కారు కోసం ప్రయత్నించవచ్చు. ఈ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా, మీరు కారును సర్వీసింగ్ చేయించడం ద్వారా కారు కొత్తదిగా కనిపించేలా చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

కొత్త కార్ల యజమానులు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులు, RTO ఫీజులను కూడా చెల్లించాలి. అయితే ఉపయోగించిన కారు కొనుగోలుదారులు ఈ ఛార్జీలన్నింటినీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్త కారు విలువ చాలా త్వరగా పడిపోతుంది. కారు మొత్తం తరుగుదలలో 20-30% కేవలం ఒక సంవత్సరంలోనే జరుగుతుంది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత తరుగుదల మరింత క్రమంగా మారుతుంది. సంవత్సరాలు గడిచేకొద్దీ తరుగుదల రేటు తగ్గుతుంది. అందువల్ల ఉపయోగించిన కారు చాలా వరకు తక్కువ ధరల్లో లభిస్తుంది.

కారును కొనుగోలు చేసేటప్పుడు, బీమా ఖర్చు అనేది పరిగణించవలసిన ముఖ్యమైన అంశం. చాలా సందర్భాలలో పాత కార్లతో పోలిస్తే కొత్త కార్ల బీమా ప్రీమియంలు ఎక్కువగా ఉంటాయి. కొత్త కార్ల మార్కెట్ ధర ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. సగటున మీరు ఉపయోగించిన కార్ల బీమా ప్రీమియంల కోసం ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ కార్లు లేదా CPOలు కారుని తిరిగి ఇచ్చే అవకాశం, తయారీదారుల వారంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి అనేక ప్రయోజనాలతో వస్తాయి.

మరో ప్రయోజనం వారంటీకి సంబంధించినది. సెకండ్ హ్యాండ్ కార్లకు సంబంధించి మార్కెట్‌లో పూర్తి పారదర్శకత ఉంది. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న కారు సర్వీస్ హిస్టరీని తెలుసుకోవచ్చు. మీరు కారును కొనుగోలు చేసే డీలర్‌షిప్ మీకు పూర్తి లేదా పాక్షిక వారంటీ కవరేజీని అందిస్తుంది. వారంటీ చాలా సందర్భాలలో ఇంజిన్ లో వచ్చే ఇబ్బందులకు సంబంధించి ఉంటుంది. అంతేకాకుండా డీలర్‌షిప్ మీ కారును సరిచేసి ఇవ్వలేకపోతే.. వారెంటీ సమయంలో దానికి సరిపడా నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు సెకండ్ హ్యాండ్ కార్లపై గరిష్టంగా 3 సంవత్సరాల వారంటీ కవరేజీని పొందవచ్చు.

ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయడం ప్రతి అంశంలో సరైనదేనా అనే ప్రశ్న తలెత్తుతుంది. మైలేజీ వంటి కొన్ని సమస్యలు ఉంటాయి. కొత్త కార్ల కంటే సెకండ్ హ్యాండ్ కార్ల సగటు మైలేజ్ ఎల్లప్పుడూ తక్కువగా ఉంటుంది. ఉపయోగించిన కార్లకు నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి మీరు సెకండ్‌ హ్యాండ్ కారును కొనుగోలు చేయాలని నిర్ణయించుకునే ముందు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి