Bank Customers Alert: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా..? ఇక నుంచి బాదుడే.. బాదుడు.. భారీగా పెరగనున్న ఛార్జీలు
కస్టమర్లపై బ్యాంకులు ఛార్జీల మోత మోగిస్తుండటంతో మరింత భారం ఏర్పడుతోంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇతర ఛార్జీలను పెంచుతున్నాయి. ఇక దేశంలో ఓ ప్రైవేటు బ్యాంకు తన కస్టమర్లపై ఛార్జీల మోత మోగిస్తోంది. బ్యాంకు డెబిట్ కార్డు వార్షిక ఛార్జీలతో పాటు అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయకపోతే ఛార్జీలను విధిస్తోంది..
దేశంలోని ఒక ప్రైవేట్ రంగ బ్యాంకు డెబిట్ కార్డ్ సౌకర్యం కింద వార్షిక ఛార్జీని పెంచింది. కోటక్ మహీంద్రా బ్యాంకు నుంచి ఈ పెంపుదల 22 మే 2023 నుంచి అమలులోకి వస్తుంది. ఈ మేరకు తన కస్టమర్లకు మెయిల్ చేసింది. పెంచిన ఛార్జీలు మే 22 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. అయితే డెబిట్ కార్డు ఛార్జీలు 30 శాతం వరకు పెంచుతున్నట్లు కస్టమర్లకు తెలిపింది. వార్షిక డెబిట్ కార్డ్ ఛార్జీ రూ.60 పెరిగింది. బ్యాంకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఈ ఛార్జీ ఏడాదికి రూ.199తో పాటు జీఎస్టీతో వసూలు చేస్తున్నారు. ఈ ఛార్జీ అన్ని రకాల ఖాతాలకు వర్తిస్తుంది. అలాగే ఈ బ్యాంకు మహీంద్రా బ్యాంక్ సేవింగ్స్, సాలరీ అకౌంట్లపై విధించిన ఛార్జీల ఇలా ఉన్నాయి. ఇవి జూన్ 1, 2022 నుంచి వర్తించనున్నాయి.
కనీస బ్యాలెన్స్ కోసం ఛార్జీలు
కోటక్ మహీంద్రా సేవింగ్స్ అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకుంటే ఛార్జీలు తప్పవు. 6 శాతం లేదా గరిష్టంగా ప్రొడక్ట్ వేరియంట్‌పై రూ.500/600 వరకు ఛార్జీ వసూలు చేస్తోంది బ్యాంకు. చెక్కు జారీ, ఆర్థికేతర కారణాల కోసం రిటర్న్‌ల కోసం ప్రతి లావాదేవీకి రూ.50 రుసుము విధించబడుతుంది. స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ ఫెయిల్ అయితే రూ.200 ఫీజు ఉంటుంది. చెక్ డిపాజిట్, రిటర్న్ లావాదేవీలపై రూ.200 రుసుము కూడా ఉంది. అదే సమయంలో చెక్‌బుక్‌కు రూ.25 రుసుము కూడా వసూలు చేస్తారు.
కార్డు చోరీకి గురైనా, పోయినా డెబిట్ కార్డ్ చార్జీ రూ.200 విధిస్తారు. దేశీయ ATM మెషీన్‌లో తక్కువ బ్యాలెన్స్ కారణంగా లావాదేవీని తిరస్కరించినట్లయితే, అప్పుడు రూ.25 ఛార్జీ ఉంటుంది. కార్డ్‌లెస్ నగదు లావాదేవీపై ఒక నెలలో ఒక ఉపసంహరణ ఉచితం, మిగిలిన వాటికి రూ.10 ఛార్జీ చెల్లించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి