Income Tax: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. ఇలా చేస్తే రూ.10,000వరకూ పన్ను ఆదా.. పూర్తి వివరాలు..
సాధారణంగా సేవింగ్స్ ఖాతాలపై ఎటువంటి పన్ను మినహాయింపులు ఉండవు అని అందరూ భావిస్తారు. కానీ సాధారణ సేవింగ్స్ ఖాతాలోని నగదుపై వచ్చే వడ్డీకి కూడా కొంతమేర పన్ను మినహాయింపు ఉందని చాలా మందికి తెలీదు. రూ. 10,000 వరకూ సేవింగ్స్ ఖాతాలపై పన్ను మినహాయింపు పొందవచ్చు.
భారతదేశంల ప్రతి పౌరుడు నిర్ణీత ఆదాయాన్ని మించి సంపాదిస్తున్నట్లయితే వివిధ శ్లాబ్లకు అనుగుణంగా ఆదాయ పన్ను ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే పౌరుల భవిష్యత్తు అవసరాలు, పొదుపు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఆదాయ పన్నుల శాఖ కొన్ని రకాల పన్ను మినహాయింపులను కొన్ని పథకాలపై అందిస్తుంది. వీటిల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని పొందాలనేది దీని ఉద్దేశం. వాటిల్లో ఆరోగ్య బీమా, విద్యా రుణాలు, స్వచ్ఛంద విరాళాలపై కొన్ని పన్ను మినహాయింపులు ఉంటాయి. సాధారణంగా సేవింగ్స్ ఖాతాలపై ఎటువంటి పన్ను మినహాయింపులు ఉండవు అని అందరూ భావిస్తారు. కానీ సాధారణ సేవింగ్స్ ఖాతాలోని నగదుపై వచ్చే వడ్డీకి కూడా కొంతమేర పన్ను మినహాయింపు ఉందని చాలా మందికి తెలీదు. రూ. 10,000 వరకూ సేవింగ్స్ ఖాతాలపై పన్ను మినహాయింపు పొందవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80టీటీఏ కింద ఈ మినహాయింపు లభిస్తుంది. అసలు సెక్షన్ 80టీటీఏ అంటే ఏమిటి? దీని ద్వారా పన్ను చెల్లింపుదారులకు లభించే వెసులుబాటు ఏమిటి? దానిని ఎలా క్లయిమ్ చేసుకోవాలి వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇది సెక్షన్ 80టీటీఏ..
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80టీటీఏ ప్రకారం దేశంలోని హిందూ అవిభక్త కుటుంబాలకు (హెచ్ యూఎఫ్) చెందిన వ్యక్తి బ్యాంకులు, కో-ఆపరేటివ్ సొసైటీలు పోస్టాఫీసులలోని తన సేవింగ్స్ ఖాతాలపై వచ్చే వడ్డీపై రూ.10,000 వరకూ మినహాయింపును క్లయిమ్ చేసుకోవచ్చు. ఆ వ్యక్తి సేవింగ్స్ ఖాతాపై వచ్చే వడ్డీ రూ.10,000 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దీనిని వినియోగించుకుంటే ప్రయోజనం ఉంటుంది. అయితే ఈ సెక్షన్ కేవలం సేవింగ్స్ ఖాతాకు మాత్రమే వర్తిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు లేదా మరేదైనా పెట్టుబడిపై ఆర్జించే వడ్డీకి ఈ సెక్షన్ వర్తించదు. అలాగే ఇది సేవింగ్స్ ఖాతాలో ఉన్న నగదుపై వచ్చే వడ్డీకి మాత్రమే వర్తిస్తుంది. ఖాతాలోని అసలుపై ఎటువంటి మినహాయింపు ఈ సెక్షన్ కింద రాదు. అలాగే ఒక వ్యక్తి ఏడాదిలో ఒక వ్యక్తి మాత్రమే ఈ సెక్షన్ కింద క్లయిమ్ చేసుకొనే అవకాశం ఉంటుంది. రెండు, మూడు అకౌంట్లపై దీనిని వినియోగించుకోవడం కుదరదు. ఈ సెక్షన్ సీనియర్ సిటీజనులకు వర్తించదు. వారికి సెక్షన్ 80టీటీబీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది.
ఇలా క్లయిమ్ చేయాలి..
ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేస్తున్నప్పుడు మీరు మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు, ఇన్ కమ్ ఫ్రమ్ అథర్ సోర్సెస్ విభాగంలో మీ ఖాతాపై వచ్చిన వడ్డీ మొత్తాన్ని నివేదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత, అదే విభాగంలో సెక్షన్ 80టీటీఏ కింద రూ. 10,000వరకు తగ్గింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. అందుకోసం మీరు మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, వడ్డీ సర్టిఫికెట్ లను సమర్పించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..