AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Bike: ఈవీ మార్కెట్‌లోకి ఏసర్.. సూపర్ స్టైలిష్ ఈ-బైక్ రిలీజ్.. డిజైన్ చూస్తే మతిపోతుందంతే

తాజాగా కంప్యూటర్ల తయారీ కంపెనీ ఏసర్ కూడా ఈవీ మార్కెట్‌లోకి వచ్చింది. తేలికపాటి ఈ-బైక్‌తో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఏసర్ ఈబీఐ పేరుతో అందుబాటులో ఉన్న ఈ బైక్ డిజైన్‌పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంది.

Electric Bike: ఈవీ మార్కెట్‌లోకి ఏసర్.. సూపర్ స్టైలిష్ ఈ-బైక్ రిలీజ్.. డిజైన్ చూస్తే మతిపోతుందంతే
Acer Ebii
Nikhil
| Edited By: seoteam.veegam|

Updated on: Apr 10, 2023 | 11:13 AM

Share

Acer E-Bike: ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల క్రేజ్ విపరీతంగా పెరుగుతుంది. దీంతో అన్ని కంపెనీలు ఈవీ మార్కెట్‌లోకి వచ్చి తమ కొత్త మోడల్స్‌ను వినియోగదారులకు అందిస్తున్నాయి. తాజాగా కంప్యూటర్ల తయారీ కంపెనీ ఏసర్ కూడా ఈవీ మార్కెట్‌లోకి వచ్చింది. తేలికపాటి ఈ-బైక్‌తో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఏసర్ ఈబీఐ పేరుతో అందుబాటులో ఉన్న ఈ బైక్ డిజైన్‌పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంది. కేవలం 16 కేజీల బరువుతో వచ్చే ఈ బైక్ ఏఐ ఆధారంగా పని చేస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బైక్ ట్రాన్స్‌మిషన్‌ను గుర్తించడానికి అంతర్నిర్మిత ఏఐ పని చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా బైక్ ఏదైనా రాపిడి జరిగితే వెంటనే అలర్ట్ వచ్చేలా ప్రత్యేక సెన్సార్లను ఉపయోగించారు. ఆటో మెటిక్ లాక్ అండ్ అన్‌లాక్ ఫీచర్లు ఈ బైక్ ప్రత్యేకతగా ఉంటున్నాయి. అలాగే 24/7 పని చేసేలా అధునాతన ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ-బైక్‌ను ఎవరైనా దొంగలిస్తే రిమోట్‌గానే లాక్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అంతర్నిర్మిత జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఈ బైక్ వెంటనే ట్రాక్ చేయవచ్చు. 

ఏసర్ ఈ-బైక్ ప్రత్యేకతలు ఇవే

ఏసర్ ఈబీఐ చైన్ డ్రైవ్‌కు బదులుగా బెల్ట్ డ్రైవ్‌తో వస్తుంది. అలాగే హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్‌లతో పాటు 360 డిగ్రీ ఎల్ఈడీ లైటింగ్ వంటి హై-ఎండ్ ఫీచర్లతో వస్తుంది. ఈ ఈ-బైక్‌లో 460 డబ్ల్యూహెచ్ ఎలక్ట్రిక్ సైకిల్ బ్యాటరీ కూడా ఉంది. ఇది ఒక్కో ఛార్జ్‌కు 110 కిలో మీటర్ల మైలేజ్ ఉంటుంది. ఈ బైక్ గంటలకు 25 గంటల స్పీడ్‌తో వస్తుంది. అలాగే 250 వాట్స్‌ మోటర్‌తో సెపరేట్‌ స్పీడ్‌తో వస్తుంది. ఈ బైక్‌ను పూర్తిగా చార్జ్ చేయాలంటే 2.5 గంటల సమయం పడుతుంది. అయితే ఈ బైక్‌తో వచ్చే బ్యాటరీ రిమూవబుల్ అవ్వడం వల్ల ఒక్క బైక్‌కే కాకుండా గృహోపకరణాలకు కూడా చార్జ్ చేసుకోవచ్చు. అయితే ఈ బైక్‌ ధర మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..