Electric Bike: మార్కెట్‌లోకి సూపర్ ఈవీ బైక్.. వారెవ్వా.. ఒక్కసారి చార్జ్ ఏకంగా 350 కిలో మీటర్ల మైలేజ్

అమెరికన్ కంపెనీ ఇనోరా నుంచి కొత్త ఈ-బైక్ మార్కెట్‌లోకి రానుంది. ఈ ఈ-బైక్ సైకిల్ లాంటి రూపాన్ని కలిగి ఉంటుంది. ఒకే చార్జ్‌పై ఏకంగా 350 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Electric Bike: మార్కెట్‌లోకి సూపర్ ఈవీ బైక్.. వారెవ్వా.. ఒక్కసారి చార్జ్ ఏకంగా 350 కిలో మీటర్ల మైలేజ్
Ev
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 10, 2023 | 10:44 AM

Eunorau Flash EV Bike: ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్, విక్రయాలు రెండూ వేగంగా పెరుగుతున్నాయి. స్కూటర్లు, బైక్‌లు ఇలా ఆటో మొబైల్ ఇండస్ట్రీ మొత్తం ఈవీ ఫీవర్ నడుస్తుంది. దీంతో అమెరికన్ కంపెనీ ఇనోరా నుంచి కొత్త ఈ-బైక్ మార్కెట్‌లోకి రానుంది. ఈ ఈ-బైక్ సైకిల్ లాంటి రూపాన్ని కలిగి ఉంటుంది. ఒకే చార్జ్‌పై ఏకంగా 350 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బైక్‌లో మూడు విభిన్న వెర్షన్‌లను విడుదల చేస్తుంది. ఫ్లాష్ లైట్ 750-వాట్ మోటార్‌ను కలిగి ఉంటుంది. ఫ్లాష్ ఏడబ్ల్యూడీలో ఇది 750 వాట్ డ్యూయల్ మోటా‌ర్‌తో ఉంటుంది. 1,000-వాట్ ఎలక్ట్రిక్ మోటారు‌తో ఫ్లాష్ వెర్షన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఈ-బైక్ థొరెటల్, పెడల్‌తో పాటు ఉపయోగించవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

బ్యాటరీతో పాటు ఇతర ఫీచర్లు ఇవే

ఈ ఈ-బైక్‌లో 2,808 డబ్ల్యూ హెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 350 కిలోమీటర్ల వరకూ మైలేజ్ వస్తుంది. అయితే ఎలక్ట్రిక్ మోటారుతో నడిచినప్పుడు 180 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. దీని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది. ఈ రెండు-సీట్ల ఎలక్ట్రిక్ బైక్ మూడు విభిన్న బ్యాటరీలతో వస్తుంది. వీటిని వరుసగా సీటు, ఫ్రేమ్, సీటు ముందు ఉంచారు.దాని హ్యాండిల్‌బార్‌లోనే ఎల్‌సీడీ స్క్రీన్‌ని కలిగి ఉంటుంది. అలాగే మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను కూడా దానికి లింక్ చేయవచ్చు. ఇరోనూ ఈ-బైక్‌లో ఫ్రంట్ హైడ్రాలిక్ సస్పెన్షన్, వెనుక స్పింగ్ సస్పెన్షన్‌తో వస్తుంది. ఈ బైక్ కేవలం 37 నుంచి 42 కిలోల బరువు ఉంటుంది. అలాగే అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది 200 కిలోల బరువు మోస్తుంది. అయితే ఇది స్టార్టప్ కంపెనీ అయినందువల్ల కంపెనీ క్రైడ్ ఫండ్ రైజింగ్‌ను ఇటీవల ప్రారంభించింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..