PPF: పిల్లలకూ పీపీఎఫ్ ఉందని తెలుసా? పైగా రెండింతల ప్రయోజనాలు! ఖాతా ఎలా ప్రారంభించాలంటే..
ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 నుంచి రూ. 1.5లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. ముందుగా చెప్పుకున్నట్లు భార్య, పిల్లల పేరుమీద తీసుకొనే ఇతర ఖాతాలకు కూడా మరో రూ. 1.5లక్షల వరకూ గరిష్ట పరిమితి ఉంటుంది.

మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్వల్ప పెట్టుబడి పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) ఒకటి. అందరూ దీనిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. ఎందుకంటే పెట్టిన పెట్టుబడికి స్థిరమైన, కచ్చితమైన రాబడిని ఈ పథకం అందిస్తుంది. అలాగే దీనిలో ఉండే పన్ను ప్రయోజనాలు కూడా వినియోగదారులను ఆకర్షిస్తాయి. ఏడాదికి దీనిలో రూ. 1.5లక్షల వరకూ పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. అయితే పెళ్లైన వారు అదనంగా భార్య లేదా పిల్లల పేరుతో మరో ఖాతాను కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇలా పిల్లలు లేదా భార్య పేరుతో ఖాతా ప్రారంభిస్తే పథకం నుంచి వచ్చే ప్రయోజనాలను అధికం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే దీనిలో పెట్టుబడికి వడ్డీతో ఇతర ప్రయోజనాల ఏంటో చూద్దాం..
డబుల్ బెనిఫిట్..
పీపీఎఫ్ ఖాతాను కుటుంబంలో ఒకరు ప్రారంభించవచ్చు. అలాగే అదే కుటుంబం నుంచి భార్య లేదా పిల్లల పేరుతో మరో ఖాతాను తీసుకోవచ్చు. దీని వల్ల పరిమితి పెరుగుతుంది. సాధారణంగా ఒక ఖాతాకు గరిష్టంగా రూ. 1.5లక్షల వరకూ మాత్రమే పెట్టుబడి పెట్టగలం. కానీ ఇప్పుడు రెండు ఖాతాలుంటాయి కాబట్టి గరిష్టి పరిమితి పెరుగుతుంది. ఫలితంగా రాబడి కూడా పెరుగుతుంది. పన్ను రాయితీలు పొందవచ్చు.
వడ్డీ ఎంతంటే..
పీపీఎఫ్ లో 7.1శాతం వడ్డీ రేటు వస్తుంది. పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం దీనిలో పెట్టుబడులు పెట్టవచ్చు. తద్వారా అధిక రాబడితో పాటు దానిపై వచ్చే పన్ను మినహాయింపులు కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి ఒక పీపీఎఫ్ ఖాతా మాత్రమే కలిగి ఉండాలి. అయితే అదే వ్యక్తి తన పిల్లల పేరున మరో ఖాతాను ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఒక పిల్లవాడి పేరుమీద ఖాతాకు అవకాశం ఉంటుంది. మీకు ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉంటే ఒక ఖాతా పిల్ల పేరు మీర మరొకటి తల్లి పేరుమీద తీసుకోవచ్చు.
ఎంత పెట్టుబడి పెట్టవచ్చు..
దీనిలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 నుంచి రూ. 1.5లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. ముందుగా చెప్పుకున్నట్లు భార్య పిల్లల పేరుమీద తీసుకొనే ఇతర ఖాతాలకు కూడా మరో రూ. 1.5లక్షల వరకూ గరిష్ట పరిమితి ఉంటుంది. ఇది 15 ఏళ్ల కాలపరిమితితో వస్తుంది. 15ఏళ్ల తర్వాత మీరు ఐదేళ్ల చొప్పున మీరు వ్యవధిని పెంచుకునే వెసులుబాటు కల్పిస్తారు.
పీపీఎఫ్ ఖాతా ఎలా ప్రారంభించాలి..
మీ పిల్లల పేరు మీద పీపీఎఫ్ ఖాతా ప్రారంభించాలనుకుంటే కొన్ని డాక్యూమెంట్లు మీరు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే పాప లేదా బాబు ఫొటో, వారి వయస్సు ధ్రువీకరణ పత్రం(ఆధార్ లేదా జనన ధ్రువీకరణ పత్రం), ఆ పాప లేదా బాబు సంరక్షుని కేవైసీ వివరాలు వంటివి ఉండాలి. ఖాతా ప్రారంభించాక, మీ పాప లేదా బాబు వయసు 18 ఏళ్లు దాటాక వారికి అకౌంట్ నిర్వహించుకునే హక్కు పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







