Business Ideas: మహిళలు రోజుకు రెండు,మూడు గంటలు కష్టపడితే చాలు.. విదేశాల్లో కూడా డాలర్లు సంపాదించే అవకాశం..

మహిళలు ఇంటి వద్ద ఉండే చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియాను ఇప్పుడు మీ ముందు ఉంచ బోతున్నాము.

Business Ideas: మహిళలు రోజుకు రెండు,మూడు గంటలు కష్టపడితే చాలు.. విదేశాల్లో కూడా డాలర్లు సంపాదించే అవకాశం..
Business Ideas
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 26, 2023 | 11:50 AM

మహిళలు ఇంటి వద్ద ఉండే చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియాను ఇప్పుడు మీ ముందు ఉంచ బోతున్నాము. ఈ బిజినెస్ చేయడం ద్వారా రోజుకు కేవలం రెండు మూడు గంటలు మాత్రమే కష్టపడి చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.

మహిళలు గాజులు వేసుకోవడానికి చాలా ఇష్టపడుతుంటారు ఎన్ని గ్యాడ్జెట్స్ వచ్చినప్పటికీ గాజులు వేసుకోవడానికి మహిళలు చాలా ఇష్టపడతారు అయితే ప్రస్తుతం ట్రెండీ డిజైన్స్ తో ఉన్న గాజులను వేసుకునేందుకు మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు దీన్నే మీరు ఒక మంచి వ్యాపార అవకాశం గా మార్చుకునే వీలుంది.

మంచి డిజైన్ చేసినటువంటి గాజులను ధరించి ఫంక్షన్లకు పార్టీలకు వెళ్లేందుకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇలాంటి డిజైన్లను మీరు ఇంటి వద్దనే చేసి గాజులను విక్రయించినట్టయితే చక్కటి ఆదాయం పొందే వీలుంది. ఇలాంటి డిజైన్లను చేయాలంటే ఏం చేయాలో, ఎక్కడ నేర్చుకోవాలో, ఎలాంటి ముడిసరుకు తెచ్చుకోవాలో, ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

గాజులను కొనుగోలు చేసి వాటికి చక్కటి డిజైన్ వేసి విగ్రహించడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. ఇందుకోసం మీరు మార్కెట్లో పింగాణితో చేసిన గాజులు గాజుతో చేసిన గాజులు అలాగే సిరామిక్ తోచేసిన గాజులు, మెటల్ తో చేసిన గాజులను ఎంపిక చేసుకోవచ్చు. . వీటిని మీరు హోల్ సేల్ గా కొనుగోలు చేసుకోవాలి. ముఖ్యంగా గాజుల తయారీదారుల వద్దనే మీరు వీటిని హోల్ సేల్ గా పొందవచ్చు.

గాజులను కొనుగోలు చేసిన తర్వాత వాటికి చక్కటి డిజైన్లను వేసేందుకు మీరు గాజులపై వివిధ రకాల డిజైనింగ్ మెటీరియల్ అతికించవచ్చు. ముత్యాలు, రంగుల రంగుల పూసలు, కుందన్ లు, మెరుపులు, ఇతర ఆకర్షణీయమైన వస్తువులను మీరు హోల్ సేల్ గా కొనుగోలు చేయవచ్చు. వీటిని ఆకర్షణీయంగా ప్లెయిన్ గాజులకు అతికించి విక్రయించవచ్చు. కస్టమర్లు కోరిన డిజైన్లను కూడా మీరు రూపొందించి విక్రయించడం ద్వారా మంచి వ్యాల్యూ పొందే అవకాశం ఉంది.

ఈ డిజైన్ చేసినటువంటి గాజులను ఆన్లైన్ ద్వారా కూడా విక్రయించవచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో వంటి యాప్ లలో నమోదు చేసుకొని మీరు ఈ డిజైనర్ గాజులను చక్కటి విలువతో పంచుకోవచ్చు. అంతేకాదు బోటిక్ నిర్వాహకులు, ఫ్యాషన్ డిజైనర్లతో చక్కటి సంబంధాలు పెట్టుకొని డిజైనర్ వేర్ మ్యాచింగ్ అయ్యేలా గాజులను డిజైన్ చేస్తే మీకు అదనపు ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది.

ఇక మిమ్మల్ని మీరు కస్టమర్లకు పరిచయం చేసుకునేందుకు ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ వంటి వేదికల్లో వీడియోలు అదే విధంగా ఫోటోలు ఉంచడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది అదేవిధంగా ఆర్డర్లు కూడా పొందుతారు. కస్టమర్లను పొందేందుకు మిమ్మల్ని మీరు డిజిటల్ మీడియా ద్వారా కూడా పరిచయం చేసుకోవచ్చు తద్వారా మీరు విదేశాల్లో ఉన్నటువంటి కస్టమర్లతో కూడా సంబంధం ఏర్పాటు చేసుకునే వీలుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం 

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!