AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Layoff: మళ్లీ మొదలైన ఉద్యోగుల తొలగింపు.. ఏకంగా 10 వేల మందిని ఇంటికి పంపుతోన్న టెక్‌ దిగ్గజం.

టెక్‌ రంగంలో మరోసారి ఉద్యోగాల తొలగింపు ఊపందుకుంటోంది. గత కొన్ని రోజులుగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ఆగిపోయిందని అందరూ ఊపిరి పీల్చుకుంటోన్న సమయంలో తాజాగా టెక్‌ దిగ్గజం ఊహించని షాక్‌ ఇచ్చింది. ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా ఏకంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మార్చిలో...

Layoff: మళ్లీ మొదలైన ఉద్యోగుల తొలగింపు.. ఏకంగా 10 వేల మందిని ఇంటికి పంపుతోన్న టెక్‌ దిగ్గజం.
Layoffs
Narender Vaitla
|

Updated on: May 26, 2023 | 2:36 PM

Share

టెక్‌ రంగంలో మరోసారి ఉద్యోగాల తొలగింపు ఊపందుకుంటోంది. గత కొన్ని రోజులుగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ఆగిపోయిందని అందరూ ఊపిరి పీల్చుకుంటోన్న సమయంలో తాజాగా టెక్‌ దిగ్గజం ఊహించని షాక్‌ ఇచ్చింది. ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా ఏకంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మార్చిలో ప్రకటించిన ప్రణాళికలో భాగంగానే ఉద్యోగుల తొలగింపు చేపట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ ఉద్యోగుల తొలగింపుల్లో భాగంగా భారత్‌లోనూ కీలక పదవుల్లో ఉన్న వారు ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఇటీవలి రౌండ్‌లో మెటా రిట్రెంచ్‌మెంట్‌లో భారత్ నుంచి చాలా మంది పేర్లను జాబితాలో చేర్చింది.

ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ అవినాష్ పంత్, డైరెక్టర్, మీడియా పార్టనర్‌షిప్ హెడ్ సాకేత్ ఝా సౌరభ్‌లను మెటా తొలగించింది. ఈ రౌండ్ తొలగింపులలో మార్కెటింగ్, సైట్ భద్రత, ఎంటర్‌ప్రైజ్ ఇంజనీరింగ్, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్, కంటెంట్ స్ట్రాటజీ, కార్పొరేట్ కమ్యూనికేషన్‌లో పనిచేస్తున్న వారు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఉద్యోగులు కోల్పోయిన వారు లింక్‌డిన్‌లో తమ అనుభవాలను పంచుకుంటున్నారు.

ఇదిలా ఉంటే మెటా ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి కాదు.. గతేడాది నవంబర్‌లో కూడా ఏకంగా 11 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. గత కొన్ని రోజులుగా మెటా ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో పాటు ద్రవ్యోల్బణం, డిజిటల్ ప్రకటనల తగ్గింపు కారణంగా కంపెనీపై భారం పెరుగుతోంది. దీంతో ఉద్యోగుల తొలగింపు తప్పడంలేదు. అదేవిధంగా తన ఖర్చులను తగ్గించడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై దృష్టి పెట్లేందుకు ప్రయత్నిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి