Basara RGUKT Admissions 2023: బాసర ఆర్‌జీయూకేటీ-2023 అడ్మిషన్ షెడ్యూల్ విడుదల.. జూన్ 1న నోటిఫికేషన్
బాసర ఆర్‌జీయూకేటీలో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటిగ్రేటెడ్ బీటెక్ (ఇంటర్+బీటెక్) కోర్సులో ప్రవేశాలకు జూన్ 1న నోటిఫికేషన్ జారీ చేయనుంది. మొత్తం 1650 సీట్లను భర్తీ చేయనున్నారు. జూన్ 5 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..
బాసర ఆర్‌జీయూకేటీలో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటిగ్రేటెడ్ బీటెక్ (ఇంటర్+బీటెక్) కోర్సులో ప్రవేశాలకు జూన్ 1న నోటిఫికేషన్ జారీ చేయనుంది. మొత్తం 1650 సీట్లను భర్తీ చేయనున్నారు. జూన్ 5 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ కొనసాగుతుందని బాసర ఆర్‌జీయూకేటీ వీసీ వి వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు బుధవారం అడ్మిషన్ షెడ్యూల్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. వర్సిటీలో 1500 సీట్లు ఉండగా.. 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 150 అదనంగా భర్తీ చేస్తామన్నారు. ప్రవేశాల ప్రక్రియ విధానంలో కొన్ని మార్పులు చేయడం వల్ల నోటిఫికేషన్ జారీ ఆలస్యమైందన్నారు.
జూన్ 20వ తేదీని ఓపెన్ డేగా పాటిస్తున్నామని, ఆరోజు విద్యార్థులు వచ్చి వర్సిటీలోని ల్యాబ్‌లను, తరగతి గదులను సందర్శించవచ్చన్నారు. మొత్తం సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తామన్నారు. మిగిలిన 15 శాతం సీట్లను ఏపీ విద్యార్థులు పోటీ పడవచ్చన్నారు. ఈ సంవత్సరం పదో తరగతి పాసైన వారు మాత్రమే అర్హులని, 2023 డిసెంబరు31 నాటికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వయసు 21 సంవత్సరాలు, మిగిలిన వారి వయసు 18 ఏళ్ల లోపు వయోపరిమితి ఉండాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.450, ఇతరులకు రూ.500 దరఖాస్తు ఫీజు ఉంటుందన్నారు.
బాసర ఆర్‌జీయూకేటీ-2023 అడ్మిషన్ షెడ్యూల్ ఇదే..
- జూన్ 1: నోటిఫికేషన్ జారీ
- జూన్ 5-19: ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
- జూన్ 24: ప్రత్యేక కేటగిరీ (పీహెచ్/క్యాప్/ఎన్‌సీసీ/క్రీడాకారులు) అభ్యర్ధులు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింటౌట్‌ను సమర్పించేందుకు తుది గడువు
- జూన్ 26: ఎంపికైన విద్యార్థుల జాబితా వెల్లడి
- జులై 1: తొలి విడత కౌన్సెలింగ్ (ధ్రువపత్రాల పరిశీలన)
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.