Bike Sales: కొత్త బైక్ కొనే ప్లాన్ ఉందా.? రూ. లక్షలోపు లభించే అద్దిరిపోయే మోడల్స్ ఇవే..
Buying A New Bike: కొత్త బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా..! ఎక్కువ మైలేజీతో పాటు అదిరిపోయే ఫీచర్లు కూడా కావాలా.. పలు స్టైలిష్ బైకులు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చేశాయ్. ప్రస్తుతం కొత్త బైక్ కొనాలంటే లక్షల్లో డబ్బులు వెచ్చించాల్సిందే. అందుకే ఎప్పుడూ కూడా..

కొత్త బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా..! ఎక్కువ మైలేజీతో పాటు అదిరిపోయే ఫీచర్లు కూడా కావాలా.. పలు స్టైలిష్ బైకులు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చేశాయ్. ప్రస్తుతం కొత్త బైకులు కొనాలంటే లక్షల్లో డబ్బులు వెచ్చించాల్సిందే. అందుకే ఎప్పుడూ కూడా మీ బడ్జెట్, బైక్ పనితీరు, మైలేజీని చూసుకుని ఏదైనా బైక్ తీసుకోవాలి. ఒకవేళ మీరు కూడా అదే పనిలో ఉన్నట్లయితే.. రూ. లక్షలోపు దొరికే పలు బైక్ మోడల్స్ మీ ముందుకు తీసుకొచ్చేశాం. మరి వాటి ప్రత్యేక్యతలు, మైలేజీ ఎంత ఉందో తెలుసుకుందామా..
-
హోండా ఎస్‌పీ125:
అనువైన ధరలో.. మంచి మైలేజీతో మార్కెట్‌లో దొరికే బెస్ట్ 125 సీసీ బైక్ ఈ హోండా ఎస్‌పీ 125. దీని ప్రస్తుతం ఎక్స్-షోరూమ్ ధర రూ.78,400గా ఉంది. ఇందులో అమర్చబడిన 123.94సీసీ ఇంజిన్.. 10.72 బీహెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లీటర్‌కు 68 కిమీ మైలేజ్ అందిస్తుంది. ట్యూబ్‌లెస్ టైర్లు, ఎలక్ట్రిక్ స్టార్ట్ లాంటి ఫీచర్లు బెస్ట్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.
-
టీవీఎస్ స్పోర్ట్:
మైలేజ్ పరంగా చూసుకుంటే.. టీవీఎస్ బైకులు ముందు వరుసలో ఉంటాయి. ఈ టీవీఎస్ స్పోర్ట్ బైక్‌లో 109.7 సీసీ ఇంజిన్ అమర్చబడి ఉంది. ఇది 70 కిమీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ.63,950(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. స్పోర్టీ కలర్ స్కీమ్స్, అల్లాయ్ వీల్స్, పవర్ అవుట్‌పుట్ లాంటివి మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి.
-
హీరో మోటోకార్ప్ గ్లామర్:
ఈ బైక్ లక్షలోపు లభిస్తోంది. ఇందులో 124.5 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అమర్చబడి ఉంది. పెట్రోల్‌తో నడిచే ఈ బైక్ లీటర్‌కు 55 కిమీ మైలేజ్ అందిస్తోంది. ప్రస్తుతం ఈ బైక్‌కి సంబంధించి రెండు మోడల్స్ అందుబాటులో ఉండగా.. వాటి ధరలు రూ. 78 వేల నుంచి 82 వేల వరకు ఉంది.




