AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold import: యూఏఐ నుంచి మన దేశానికి భారీగా బంగారం.. 160 టన్నుల దిగుమతికి ఆమోదం

దేశంలో బంగారు ఆభరణాలకు ఎంతో డిమాండ్ ఉంది. మిగిలిన లోహాలతో పోల్చితే బంగారం కొనుగోలుకే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. పెళ్లిళ్లు, పండగలు, ఇతర శుభకార్యాల సమయంలో బంగారు ఆభరణాలు చాలా కీలకంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బంగాన్ని కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా మహిళలు తమ పొదుపును దీనిపైనే ఖర్చు చేస్తారు. అత్యవసర సమయంలో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే అవకాశం ఉండడంతో సీజన్ తో సంబంధం లేకుండా బంగారం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి.

Gold import: యూఏఐ నుంచి మన దేశానికి భారీగా బంగారం.. 160 టన్నుల దిగుమతికి ఆమోదం
Gold Rate
Nikhil
|

Updated on: Aug 30, 2024 | 3:45 PM

Share

దేశంలో బంగారు ఆభరణాలకు ఎంతో డిమాండ్ ఉంది. మిగిలిన లోహాలతో పోల్చితే బంగారం కొనుగోలుకే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. పెళ్లిళ్లు, పండగలు, ఇతర శుభకార్యాల సమయంలో బంగారు ఆభరణాలు చాలా కీలకంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బంగాన్ని కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా మహిళలు తమ పొదుపును దీనిపైనే ఖర్చు చేస్తారు. అత్యవసర సమయంలో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే అవకాశం ఉండడంతో సీజన్ తో సంబంధం లేకుండా బంగారం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా వ్యాపారులు, ఆభరణాల తయారీదారులు ఇతర దేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ ఉంటారు. దీనిలో భాగంగా ఇటీవల యూఏఈ నుంచి రాయితీ ధరపై 160 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

యూఏఈలో చౌక

యూఏఈలో బంగారంపై జీఎస్టీ ఉండదు. తయారీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా అక్కడ బంగారం చాలా చౌకగా లభిస్తుంది. భారత్, యూఏఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీవీ) ఉంది. దానిలో భాగంగా ఆ దేశం నుంచి బంగారం దిగుమతి జరుగుతుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2024-25లో 160 టన్నుల బంగారం మన దేశానికి రానుంది.

ఒప్పందం

యూఏఈతో కుదిరిన ఒప్పందం ప్రకారం టారిఫ్ కోట కింద (టీఆర్ క్యూ) ఒక శాతం టారిఫ్ రాయితీతో మనం ఏటా 200 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవచ్చు. దీనిలో భాగంగా గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 140 టన్నులు మన దేశానికి వచ్చింది. ఇప్పుడు మరో 160 టన్నులు దిగుమతి కానుంది.

ఇవి కూడా చదవండి

బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం

ప్రపంచంలో జరుగుతున్న మార్పులు, ఘటనలు, అనిశ్చితి కారణంగా 2024-25 ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో దేశ బంగారం దిగుమతులు 4.23 శాతం తగ్గిపోయి 12.64 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కానీ 2023-24లో మాత్రం 30 శాతం పెరిగి 45.54 బిలియన్లకు వరకూ వెళ్లాయి. ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. దీనితో దిగుమతులు పెరుగుతాయని ఆశిస్తున్నాయి. దీనివల్ల బంగారం రేటు తగ్గి, మార్కెట్లో కొనుగోళ్లు విపరీతంగా పుంజుకునే అవకాశం ఉంది.

దిగుమతులు

మన దేశానికి వివిధ దేశాల నుంచి బంగారం దిగుమతి అవుతుంది. వాటిలో స్విట్జర్లాండ్ ప్రథమ స్థానంలో ఉంది. మన దిగుమతుల్లో 40 శాతం అక్కడి నుంచే జరుగుతాయి. ఆ తర్వాత స్థానాలలో 16 శాతంతో యూఏఈ, 10 శాతంతో దక్షిణాఫ్రికా ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..