Recharge plan: రోజుకు 3 జీబీ డేటా, ఏడాది వ్యాలిడిటీ.. సూపర్‌ రీఛార్జ్‌ ప్లాన్‌

రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌తో మెరుగైన సేవలు అందిస్తోంది. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఒక్కసారిగా సబ్‌స్క్రైబర్స్‌ పెరిగిపోయారు. ఇప్పుడిప్పుడే 4జీ సేవలను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లను ఆకర్షించే దిశగా కొంగొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌ను ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆకర్షణీయమైన ప్లాన్‌ను పరిచయం చేసింది...

Recharge plan: రోజుకు 3 జీబీ డేటా, ఏడాది వ్యాలిడిటీ.. సూపర్‌ రీఛార్జ్‌ ప్లాన్‌
Recharge Plan
Follow us

|

Updated on: Aug 30, 2024 | 8:09 AM

ప్రస్తుతం టెలికం సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. జియో వచ్చిన తర్వాత ఛార్జీలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల టెలికం సంస్థలు టారిఫ్‌లను ఒక్కసారిగా పెంచాయి. జియోతో మొదలైన ఈ పెంపు దేశంలోని అన్ని ప్రధాన టెలికం సంస్థలు కొనసాగించాల్సిన పరిస్థితికి దారి తీశాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది.

రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌తో మెరుగైన సేవలు అందిస్తోంది. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఒక్కసారిగా సబ్‌స్క్రైబర్స్‌ పెరిగిపోయారు. ఇప్పుడిప్పుడే 4జీ సేవలను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లను ఆకర్షించే దిశగా కొంగొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌ను ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆకర్షణీయమైన ప్లాన్‌ను పరిచయం చేసింది. ఎక్కువ కాలం వ్యాలిడిటీతో పాటు, డేటా ఎక్కువ కావాలనుకునే వారికి ఈ ప్లాన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

ఏడాది వ్యాలిడిటీతో బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ. 2999 రీఛార్జ్‌ ప్లాన్‌ను పరిచయం చేసింది బీఎస్‌ఎన్‌ఎల్‌. దీంతో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఒక్కసారిగా రీఛార్జ్‌ చేసుకుంటే.. ఏడాదంతా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, ఎస్‌టీడీ, రోమింగ్‌ కాల్స్‌ను పొందొచ్చు. అలాగే యూజర్లకు ప్రతీ రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. వీటితో పాటు ప్రతీ రోజూ ఉచితంగా 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

అయితే ఏడాది వ్యాలిడిటీతో రోజుకు 3 జీబీ డేటా లభించే రీఛార్జ్‌ ప్లాన్స్ ఇతర ఏ నెట్‌వర్క్‌ పరిధిలో లేకపోవడం గమనార్హం. గరిష్టంగా 84 రోజుల వ్యాలిడిటీతో ఉన్న ప్లాన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 84 రోజుల వ్యాలిడిటీతో జియోలో రూ. 1799, ఎయిర్‌టెల్‌లో రూ. 1798 ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి. మరి బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి వస్తున్న పోటీని తట్టుకునే క్రమంలో ఇతర సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో