మారుతి సుజుకి ఎ-ప్రెస్సో కారు దేశంలో ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఎస్‌యూవీ లాంటి హై రైడింగ్ స్టాన్స్‌తో కూడిన చిన్న హ్యాచ్‌బ్యాక్. దీనిని పట్టణ ప్రాంతాల్లోని ట్రాఫిక్ లో చాలా సులభంగా డ్రైవింగ్ చేయవచ్చు. ఈ కారు రూ. 4,26,500 నుంచి రూ. 6,15,000 (ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులో ఉంది. 1.0 లీటర్ కె10సీ పెట్రోల్ ఇంజిన్, పెట్రోల్ మరియు సీఎన్జీ ఇంధన ఎంపికతో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.