Best Electric Car: మార్కెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే.. అత్యధిక రేంజ్.. అదిరే ఫీచర్లు..

మన భారతీయ ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచంలో టాప్ కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక్కడ లాంచ్ చేస్తున్నాయి. వాటిల్లో మన దేశీయ దిగ్గజమైన టాటా మోటార్స్ కూడా ఉంది. ఇటీవల నుంచి ఇటీవలే విడుదలైన టాటా కర్వ్ ఈవీ నుంచి ఎంజీ జెడ్ఎస్ ఈవీ వరకూ అనేక రకాల ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అత్యాధునిక ఫీచర్లతో పాటు అత్యధిక రేంజ్ ఇచ్చేవి ఉన్నాయి. అయితే వీటి ధర సాధారణ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో రూ. 25లక్షలలోపు బెస్ట్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్లను మీకు పరిచయం చేస్తున్నాం.

Madhu

|

Updated on: Aug 30, 2024 | 5:17 PM

టాటా కర్వ్ ఈవీ.. ఈ కారు ప్రారంభ ధర రూ. 17.49లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సింగిల్ చార్జ్ పై 585కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిలో 45కేడబ్ల్యూహెచ్, 55కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. దీనిలో లెవెల్ 2 అడాస్, పానరోమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉంటాయి. ఇది ఎంజీ జెడ్ఎస్ ఈవీతో భారతీయ మార్కెట్లో పోడీ పడుతుంది.

1 / 5
టాటా నెక్సాన్ ఈవీ.. ఈ కారు గతేడాది లాంచ్ అయ్యింది. ఈ ఎస్ యూవీ ధర రూ. 14,49లక్షలు నుంచి 19.29లక్షలు(ఎక్స్ షోరూం) మధ్య ఉంటుంది. దీనిలో రెండు బ్యాటరీ ప్యాక్స్ అందుబాటులో ఉన్నాయి. 30కేడబ్ల్యూహెచ్, 40.5కేబ్బ్యూహెచ్. అత్యధికంగా 465కిలోమీటర్ల రేంజ్ సింగిల్ చార్జ్ పై లభిస్తుంది. 142బీహెచ్పీ, 215ఎన్ఎం గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

2 / 5
బీవైడీ ఆట్టో3.. ఈ ఎలక్ట్రిక్ ఎస్ యూవీని ఈ ఏడాదే లాంచ్ చేశారు. దీని ధర రూ. 25లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. దీనిలో 49.92 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఎంట్రీ లెవెల్ ట్రిమ్ వచ్చేసరికి 468కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇంకా దీనిలో మరిన్ని బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. మనం ఎంచకున్న బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి రేంజ్ మారుతుంటుంది.

3 / 5
ఎంజీ జెడ్ఎస్ ఈవీ.. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ నుంచి మన దేశంలో లాంచ్ అయిన మొదటి ఎలక్ట్రిక్ కార్ ఇది. దదీనిలో 50.03కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. 174బీహెచ్పీ, 280ఎన్ఎ టార్క్ ఉంటుంది. సింగిల్ చార్జ్ పై 461 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ. 18.98లక్షలు(ఎక్స్ షోరూం) నుంచి రూ. 25.23లక్షలు(ఎక్స్ షోరూం) వరకూ ఉంటుంది.

4 / 5
మహీంద్రా ఎక్స్‌యూవీ 400.. ఈ కారు ధర రూ.15.49లక్షల(ఎక్స్ షోరూం) నుంచి ఉంటుంది. దీనిలో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. 34.5కేడబ్ల్యూహెచ్ యూనిట్, 39.4కేడబ్ల్యూహెచ్. అత్యధిక రేంజ్ సింగిల్ చార్జ్ పై 456కిలోమీటర్లు ఉంటుంది.

5 / 5
Follow us