- Telugu News Photo Gallery Business photos If you are a first time visitor to Hyderabad, these are the must Do's in city, check details in telugu
Hyderabad Tour: హైదరాబాద్‌లో తప్పక చూడాల్సిన ప్రాంతాలివే.. ఈ ‘టేస్ట్’ ఎప్పటికీ మర్చిపోలేరు..
మన తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద నగరం హైదరాబాద్. నగరాన్ని చూడాలని చాలా మంది భావిస్తుంటారు. ఇక్కడి కల్చర్, కట్టడాలు, ఆహార అలవాట్లు, వాతావరణం అందరికీ నచ్చుతాయి. అయితే చాలా మంది నగరానికి ఏదో పని మీద వచ్చి.. హడావుడిగా వెళ్లిపోతారు. అలాకాకుండా కాస్త ఫ్రీటైం చూసుకొని వస్తే హైదరాబాద్ అందాలను ఆస్వాదిస్తే ఆ ఆనందం వేరు. అందుకే మొదటి సారి నగరాన్ని దర్శించే వారి కోసం ఈ కథనాన్ని రూపొందించాం. దీనిలో చూడవలసిన సందర్శనీయ ప్రదేశాలతో పాటు రుచి చూడవలసిన ఆహార పదార్థాల జాబితాను మీకు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ను టేస్ట్ చేద్దాం రండి..
Updated on: Aug 30, 2024 | 8:17 PM

అద్భుతమైన రుచులు.. హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది ఇక్కడి బిర్యానీ. హైదారబాద్ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాగే హైదారబాదీ ట్రెడిషనల్ బ్రేక్ ఫాస్ట్ నాష్టా. ఇది తెల్లవారు జామున ఐదు గంటలకు తీసుకొంటూ ఉంటారు. ఇది ఓల్డ్ సిటీలో ఫేమస్. ఇంకా ఇరానీ చాయ్, రంజాన్ స్పెషల్ హాలీం హైదరాబాద్ టేస్ట్ ను చాటిచెబుతాయి.

చారిత్రక ప్రదేశాలు.. హైదరాబాద్ నగరానికి చారిత్రక ప్రాశస్థ్యం ఉంది. ఇక్కడ అనేక రకాల కట్టడాలు అబ్బురపరుస్తాయి. గోల్డ్కోండ ఫోర్ట్, చౌమహల్లా ప్యాలెస్, ఫాలక్నూమా ప్యాలెస్ వంటివి చాలా ఉన్నాయి.

రామోజీ ఫిల్మ్ సిటీ.. హైదారబాద్లో తప్పక చూడాల్సిన మరో ప్రదేశం ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ గా గిన్నెస్ వరల్డ్ రికార్డు నమోదు అయ్యింది. ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా అనేక చిత్రాలు చిత్రీకరణ జరిగింది. టాలీవుడ్ నుంచి బాలివుడ్ హాలీ వుడ్ వరకూ చాలా చిత్రాలు ఇక్కడ రూపొందాయి.

చెరువులను చుట్టేయండి.. హైదరాబాద్ నగరం చుట్టూ అనేక రకాల చెరువులు, సరస్సులు మనకు కనిపిస్తాయి. సాయంత్ర సమయాల్లో ఆయా చెరువుల వద్ద కుటుంబంతో ఎంజాయ్ చేయొచ్చు. నగరంలోని ప్రధాన చెరువులేవి అంటే.. గండిపేట్ చెరువు, హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, షామీర్ పేట్ చెరువు, దుర్గం చెరువు. ఇవే కాక అనేక ఎకో ఫ్రెండ్లీ పార్కులు కూడా అందుబాటులో ఉంటాయి.

షాపింగ్ డెస్టినేషన్స్.. హైదరాబాద్ షాపింగ్ ప్రియులకు బాగా నచ్చుతుంది. వీధి మార్కెట్ తో పాటు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అందుబాటులో ఉంటాయి. ల్యాడ్ బజార్, చార్మినార్ ప్రాంతం, టోలీచౌకి బజార్ వంటి లోకల్ ఫ్లేవర్ ను చాటి చెబుతాయి. అలాగే జీవీకే, ఇన్ ఆర్బిట్ మాల్ వంటి టాప్ మోడర్న్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా అబ్బురపరుస్తాయి.




