- Telugu News Photo Gallery Business photos All bank holidays for September 2024: Banks to be closed for 14 days, see full list
Bank Holidays: సెప్టెంబర్‌లో 14 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా?
ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేస్తుంటుంది. వినియోగదారులు ఈ సెలవులను గమనించి తమతమ బ్యాంకు పనులను చేసుకునేందుకు ప్లాన్ చేసుకోవడం మంచిది. లేకుంటే మీ సమయం వృధా కావడంతో పాటు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది..
Updated on: Aug 31, 2024 | 4:12 PM

ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేస్తుంటుంది. వినియోగదారులు ఈ సెలవులను గమనించి తమతమ బ్యాంకు పనులను చేసుకునేందుకు ప్లాన్ చేసుకోవడం మంచిది. లేకుంటే మీ సమయం వృధా కావడంతో పాటు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.

ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్‌లో మొత్తం 14 సెలవులు ఉండనున్నాయి. ఇందులో శని, ఆదివారాలు సెలవులు ఉన్నాయి. వినాయక చతుర్థి, ఈద్ మిలాద్ పండుగలు కూడా సెలవు జాబితాలో చేర్చారు. కేరళలో జరుపుకొనే ఓనం, తిరువణం పండుగలు ఉండనున్నాయి. బదులుగా నారాయణగురు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 18, 21 తేదీలలో కేరళలో బ్యాంకులు మూసి ఉండనున్నాయి.

సెప్టెంబరు 14 నుంచి 16 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకులకు మూడు రోజుల సెలవులు ఉంటాయి. ఇందులో 16న ఈద్ మిలాద్ కూడా ఉంది. సెప్టెంబర్ 13 నుంచి 16 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు రాజస్థాన్‌లో బ్యాంకులు మూతపడనున్నాయి. సిక్కింలో 14 నుంచి 17వ తేదీ వరకు నాలుగు రోజుల సెలవులు ఉన్నాయి.ఈద్ మిలాద్ కాకుండా శని, ఆదివారాలు మాత్రమే సెలవులు. కర్ణాటకలో మొత్తం ఎనిమిది సెలవులు ఉన్నాయి.

సెప్టెంబర్ 2024లో బ్యాంక్ సెలవుల జాబితా: సెప్టెంబర్ 5, గురువారం: శ్రీమంత శంకరదేవ తిథి (అస్సాంలో సెలవు), సెప్టెంబర్ 7, శనివారం: వినాయక చతుర్థి సెప్టెంబరు 8: ఆదివారం సెలవు (ఒడిషాలో నౌకై పండుగ), సెప్టెంబర్ 13, శుక్రవారం: రామ్‌దేవ్ జయంతి, తేజ దశమి (రాజస్థాన్‌లో సెలవు), సెప్టెంబర్ 14: రెండవ శనివారం (కేరళలో ఓనం), సెప్టెంబర్ 15: ఆదివారం సెలవు (కేరళలోని తిరువోణం), సెప్టెంబర్ 16, సోమవారం: ఈద్ మిలాద్, సెప్టెంబర్ 17, మంగళవారం: ఇంద్ర జాత్ర (సిక్కింలో సెలవు), సెప్టెంబర్ 18, బుధవారం: శ్రీ నారాయణగురు జయంతి (కేరళలో సెలవు) సెప్టెంబర్ 21, శనివారం: శ్రీ నారాయణగురు సమాధి (కేరళలో సెలవు), సెప్టెంబర్ 22: ఆదివారం సెలవు, సెప్టెంబర్ 23, సోమవారం: బలిదాన్ డే (హర్యానాలో సెలవు) సెప్టెంబర్ 28: నాల్గవ శనివారం, సెప్టెంబర్ 29: ఆదివారం సెలవు





