Foldable E-Scooter: సూట్‌కేసా? స్కూటరా? మరీ ఇలా ఎలాగబ్బా! హోండా కొత్త ఫోల్డబుల్ స్కూటర్ మామూలుగా లేదుగా..
ఒక ద్విచక్రవాహనాన్ని సూట్‌కేస్‌లో మడతపెట్టొచ్చా? అది సాధ్యమేనా? సాధ్యమే అంటోంది ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీదారు హోండా. ఓ మీడియం సైజ్ సూట్ కేస్ లో తమ స్కూటర్ ని ఎంచక్కా మడతపెట్టేసి ఎక్కడి కావాలంటే అక్కడి తీసుకెళ్లొచ్చని చెబుతోంది. దీని కోసం ప్రత్యేకమైన పార్కింగ్ స్పేస్ ఏమి అవసరం లేదని స్పష్టం చేస్తుంది. జపాన్ కు చెందిన ప్రముఖ ఆటోమోటివ్ దిగ్గజం హోండా ఈ కొత్త తరహా ద్విచక్రవాహనాన్ని ఆవిష్కరించింది.
ఒక ద్విచక్రవాహనాన్ని సూట్‌కేస్‌లో మడతపెట్టొచ్చా? అది సాధ్యమేనా? సాధ్యమే అంటోంది ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీదారు హోండా. ఓ మీడియం సైజ్ సూట్ కేస్ లో తమ స్కూటర్ ని ఎంచక్కా మడతపెట్టేసి ఎక్కడి కావాలంటే అక్కడి తీసుకెళ్లొచ్చని చెబుతోంది. దీని కోసం ప్రత్యేకమైన పార్కింగ్ స్పేస్ ఏమి అవసరం లేదని స్పష్టం చేస్తుంది. జపాన్ కు చెందిన ప్రముఖ ఆటోమోటివ్ దిగ్గజం హోండా ఈ కొత్త తరహా ద్విచక్రవాహనాన్ని ఆవిష్కరించింది. పూర్తి పర్యావరణ హితంగా విద్యుత్ శ్రేణిలో దీనిని తీసుకొచ్చింది. ఈ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ స్కూటర్ పేరు హోండా మోటోకాంపాక్టో. ఇది చూడటానికి కూడా సూట్ కేస్ షేప్ లోనే ఉంటుంది. అయితే దీని ధర రూ. 80,000పైగానే ఉంటుంది. ఈ ఫోల్డబుల్ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మోటోకాంపో డిజైన్ ఆధారంగా..
హోండా రూపొందించిన మోటోకాంపాక్టో స్కూటర్ ను 1980ల్లో జపాన్లో ప్రసిద్ధి చెందిన మోటోకాంపో ఫోల్డబుల్ స్కూటర్లను స్ఫూర్తిగా తీసుకొని తయారు చేశారు. మోటోకాంపో స్కూటర్ కారు డిక్కీలో మడతపెట్టి తీసుకెళ్లే విధంగా ఉండేది. ప్రస్తుతం హోండా రూపొందించిన మోటోకాంపాక్టో స్కూటర్ అయితే ఇంకా చిన్నగా రూపొందింది. చాలా లైట్ వెయిట్ లో ఎంచక్కా అప్పటికప్పుడు దానిని వినియోగించుకునేలా తీర్చిదిద్దింది. రోడ్లపై వెళ్తూనే.. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఈస్కూటర్ ను వెంటనే మడిచేసుకొని చేతితో పట్టుకొని వెళ్లిపోవచ్చు.
ఈ స్కూటర్ బరువు 19కేజీలు ఉంటుంది. నగరాల ప్రాంతాల్లో ఈ స్కూటర్ చాలా అనువుగా ఉంటుందని పేర్కొంది. దీని కొలతలు చూస్తే స్టాండ్ స్టిల్ మోడ్లో 742ఎంఎం పొడవు, 94ఎంఎం వెడల్పు, 536 ఎంఎం ఎత్తు ఉంటుంది. రైడింగ్ మోడ్లో ఈ స్కూటర్ కొలతలు చూస్తే 968ఎంఎం పొడవు ఉంటుంది. దీని వీల్ బేస్ 742ఎంఎం ఉంటుంది.
నడక కన్నా వేగంగా..
ఈ ఫోల్డబుల్ స్కూటర్ ని తయారు చేసిన కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఈ స్కూటర్ సగటున మనిషి నడిచే వేగం కంటే ఎక్కువగానే వెళ్తుంది. గరిష్టంగా గంటకు 24వేగంతో ఇది ప్రయాణించగలుగుతుంది. అంతేకాక ఇది ఈ టాప్ స్పీడ్ ని కేవలం ఏడు సెకండ్లలోనే అందుకుంటుంది. అయితే దీనిపై ఒక్కరు మాత్రమే ప్రయాణించగలుతారు. మోటోకాంపాక్టో స్కూటర్ గరిష్టంగా 120కేజీల బరువును మోయగలుగుతుంది.
స్పెసిఫికేషన్లు..
హోండా మోటోకాంపాక్టో స్కూటర్ లో 0.6బీహెచ్పీ పవర్, 16ఎన్ఎం గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేసే మోటార్ ఉంటుంది. ఇది నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. దీనిలో 6.8ఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 20కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఈ బ్యాటరీ 110వోల్ట్స్ సాధారణ చార్జర్ తో మూడున్నర గంటల్లోనే ఫుల్ చార్జ్ చేయొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..