Gold Price Today: కొనుగోలుదారులకు ఊరట.. తగ్గిన వెండి రేట్లు.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి రేట్లలో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కొసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. తాజాగా, బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు..

Gold Price Today: కొనుగోలుదారులకు ఊరట.. తగ్గిన వెండి రేట్లు.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
Latest Gold Silver Prices
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 28, 2023 | 6:28 AM

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి రేట్లలో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కొసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. తాజాగా, బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు తగ్గాయి. శనివారం (అక్టోబర్ 28) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,800 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,960 లుగా ఉంది. వెండి కిలో ధర రూ. 500 మేర తగ్గి.. రూ.74,600 లుగా ఉంది. తెలుగు రాష్ట్రాలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.56,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,110 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,960, కోల్‌కతాలో 22 క్యారెట్ల రేటు రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,960, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,050, 24 క్యారెట్ల ధర రూ.62,250 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,960, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,960గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,800 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.61,960 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,960 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,600 లుగా ఉంది. ముంబైలో వెండి ధర రూ.74,600, చెన్నైలో రూ.77,500, బెంగళూరులో రూ.73,750, కేరళలో రూ.77,500, కోల్‌కతాలో రూ.74,600 ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.77,500, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.77,500 లుగా ఉంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..