Honda Electric Scooter: హోండా తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ వచ్చేస్తోంది.. యాక్టివా కంటే తక్కువ ధరకే..

రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సామాన్యులను టార్గెట్ చేసుకుని, తక్కువ ధరకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Honda Electric Scooter: హోండా తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ వచ్చేస్తోంది.. యాక్టివా కంటే తక్కువ ధరకే..
Honda First Electric Scooter
Follow us
Venkata Chari

|

Updated on: Sep 21, 2022 | 11:53 AM

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హోండా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అతి త్వరలో దేశంలో విడుదల చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పెట్రోల్‌తో నడిచే ప్రస్తుత తరం యాక్టివా కంటే తక్కువ ధరను కలిగి ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ అభివృద్ధిని HMSI ప్రెసిడెంట్ అట్సుషి ఒగాటా ధృవీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. HMSI ప్రెసిడెంట్ ప్రకారం, హోండా స్కూటర్ల కొత్త మోడల్‌లు ప్రస్తుతం ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయంట. ఈ దశాబ్దం చివరి నాటికి కంపెనీ ఒక మిలియన్ EVలను విక్రయించాలని యోచిస్తోన్నట్లు ఆయన తెలిపారు. ఈ దశాబ్దం చివరి నాటికి EV రంగంలో 30 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండాలని హోండా భావిస్తోన్న తెలిపారు. అయితే, హోండా తన రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం యాక్టివా మోనికర్‌ని ఉపయోగించాలని భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో బ్యాటరీని మార్చుకునే సదుపాయం ఉంటుంది. వివిధ మోడళ్లలో అందించబడుతుందని భావిస్తున్నారు.

ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను తక్కువగా ఉంచడానికి, హోండా స్థానిక మార్కెట్ నుంచి విడిభాగాలను కొనుగోలు చేస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల, ప్రైజ్ రేంజ్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 60కిమీ కంటే ఎక్కువ ఉండదని తెలుస్తోంది. హోండా ప్రకారం, స్కూటర్ ధర కేవలం ICE వెర్షన్ Activa కంటే తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సామాన్యులను టార్గెట్ చేసుకుని, తక్కువ ధరకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

హోండా యాక్టివా 6G ఫీచర్లు..

హోండా యాక్టివా 6G ధర ప్రస్తుతం రూ. 72,400- రూ. 75,400 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంది. ఈ స్కూటర్ 109.51cc ఇంజన్‌తో విడుదలైంది. ఇది 7.79PS పవర్, 8.84Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముందు చక్రం 12 అంగుళాలు కాగా, వెనుక చక్రం 10 అంగుళాలుగా ఉంది. బ్రేకుల విషయానికి వస్తే, హోండా యాక్టివా 6G ముందు, వెనుక వైపున 130mm డ్రమ్ బ్రేక్‌లను పొందుతుంది. స్కూటర్‌లో CBS బ్రేకింగ్ ప్రామాణికంగా అందించారు.

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.