Hyderabad: మిథాని సంస్థపై సైబర్ అటాక్.. మెయిల్ పంపి రూ.40 లక్షలు కాజేశారు.. అసలేమైందంటే..?

Cyber Attack On Midhani: హ్యాకర్ల దృష్టిలో చిన్నా పెద్దా తేడా లేదు. నేషనల్‌, ఇంటర్నేషనల్‌ అన్న బేధం లేదు. దొరికితే ఎంతటిదైనా సరే ఖాళీ చేయాల్సిందే.

Hyderabad: మిథాని సంస్థపై సైబర్ అటాక్.. మెయిల్ పంపి రూ.40 లక్షలు కాజేశారు.. అసలేమైందంటే..?
Cyber Attack On Midhani
Follow us

|

Updated on: Sep 21, 2022 | 7:17 AM

Cyber Attack On Midhani: హ్యాకర్ల దృష్టిలో చిన్నా పెద్దా తేడా లేదు. నేషనల్‌, ఇంటర్నేషనల్‌ అన్న బేధం లేదు. దొరికితే ఎంతటిదైనా సరే ఖాళీ చేయాల్సిందే. వారిలో స్టూడెంట్.. టీచర్.. పోలీస్.. జడ్జి.. ఇలా ఎవరైతే మాకేంటీ.. మా ఉచ్చుకు ఎవరైనా చిక్కాల్సిందే అంటున్నారు సైబర్ కేటుగాళ్లు. తాజాగా ఓ కేంద్ర సంస్థకే టోకరా వేసి.. మేం దేనిలోనూ తక్కువేం కాదని పోలీసులకు సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన మిధానికి 40 లక్షల కుచ్చుటోపి పెట్టి.. చేతనైతే మమ్మల్ని పట్టుకోండి చూద్దాం అంటున్నారు. కెనడా సంస్థ మెయిల్ ఐడీని సైబర్‌ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆపై నకిలీ ఐడీ నుంచి మిధాని అధికారులకు సందేశం పంపారు. అప్పటికే సరుకు కోసం ఆర్డర్‌ ఇచ్చిన సంస్థ అన్న ఆలోచనలో పడ్డారు మిధాని అధికారులు. అక్కడి నుంచి వచ్చిన మెసేజ్‌ మేరకు మెయిల్‌లో సూచించిన ఖాతాకు మిధాని అధికారులు 40 లక్షలను బదిలీ చేశారు. అప్పటి దాకా ఆర్డర్‌ ఇచ్చిన సంస్థకు క్యాష్‌ వెళ్లిందని అనుకున్నారు అధికారులు.

అయితే.. ఎందుకో ఏమో.. ఎలా అనుమానం వచ్చిందో తెలియదు. నగదు రాలేదని కెనడా నుంచి ఫోన్‌ రావడంతో మిధాని అధికారులు షాక్‌ తిన్నారు. అప్పుడు గాని అసలు మోసం జరిగిందని తెలియలేదు. కెనడా సంస్థ తప్పిదం వల్లే సైబర్ మోసం జరిగిందని మిధాని అధికారులు వాపోతున్నారు. ఈ ఘటనపై సైబర్‌క్రైం పోలీసులకు మిధాని అధికారులు ఫిర్యాదు చేశారు. ఇటీవల కెనడా సంస్థ నుంచి మిధాని అధికారులు అల్యూమినియం కొనుగోలు చేశారు. ఈ లావాదేవీల్లో భాగంగానే, ఈ చెల్లింపులు జరిగినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..