AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Policy: ఎల్‌ఐసీ నుంచి అద్భుతమైన ప్లాన్‌.. ఇందులో ఒకసారి ఇన్వెస్ట్‌ చేస్తే ప్రతినెల రూ.20 వేలు

ఎల్‌ఐసీ నుంచి రకరకాల ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని మెరుగైన రాబడి అందించే పథకాలను ప్రవేశపెడుతోంది..

LIC Policy: ఎల్‌ఐసీ నుంచి అద్భుతమైన ప్లాన్‌.. ఇందులో ఒకసారి ఇన్వెస్ట్‌ చేస్తే ప్రతినెల రూ.20 వేలు
Lic Policy
Subhash Goud
|

Updated on: Nov 06, 2022 | 10:09 AM

Share

ఎల్‌ఐసీ నుంచి రకరకాల ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని మెరుగైన రాబడి అందించే పథకాలను ప్రవేశపెడుతోంది. ఇక పదవీ విరమణ చేసిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు సరికొత్త పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి. పదవీ విరమణ తర్వాత మీకు ప్రతి నెలా 20 వేల రూపాయలు లభిస్తే, మీ ఇంటి ఖర్చులు సులభంగా తీర్చవచ్చు. ఇందులో భాగంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ కోసం ఒక గొప్ప ప్లాన్‌తో ముందుకు వచ్చింది.

ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ ప్లాన్ :

ఎల్‌ఐసీ మీ కోసం జీవన్ అక్షయ్ ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఇది భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ బీమా కంపెనీ. ఇందులో పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. మీరు ఎల్‌ఐసీ పాలసీని కొనుగోలు చేయాలనుకుంటే అద్భుతమైన ఆప్షన్స్‌ ఉన్నాయి. ఈ పాలసీలో మీరు ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత మీరు ప్రతి నెల, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన పెన్షన్ పొందవచ్చు.

మీకు 75 ఏళ్లు నిండితే ప్రతి నెలా ఇంత పెన్షన్ వస్తుంది. మీరు రూ.610800 ఒకేసారి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై అతని హామీ మొత్తం రూ.6 లక్షలు. ఈ విధంగా వార్షిక పింఛను రూ.76 వేల 650, అర్ధవార్షిక పింఛను రూ.37 వేల 35, త్రైమాసిక పింఛన్ రూ.18 వేల 225, ఇక మీకు నెలవారీ పెన్షన్ కావాలంటే 6 వేల 08 రూపాయలు వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ పెన్షన్ పెట్టుబడిదారునికి జీవితాంతం అంటే మరణించే వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతినెలా రూ.20 వేలు పింఛన్ తీసుకోవాలనుకుంటే ఒకేసారి రూ. 40,72,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని పాలసీ నివేదికలు చెబుతున్నాయి.

ప్రయోజనాలు ఏమిటి?

జీవన్ అక్షయ్ ప్లాన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ఈ పాలసీని కొనుగోలు చేసిన 3 నెలల తర్వాత రుణం తీసుకునే సదుపాయం ఉంటుంది. ఈ పాలసీలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. మీరు ఈ పథకంలో కనీసం 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి