Indian Railways: రైలు ప్రయాణికుల కోసం గుడ్‌న్యూస్.. కొత్త సేవ అందుబాటులో.. ఇక నుంచి అలాంటి టెన్షన్ ఉండదు
భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వే. ప్రతి రోజు లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతుంటుంది. ఇక సామాన్యుడికి సైతం రైలు ప్రయాణం అందుబాటులో..
భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వే. ప్రతి రోజు లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతుంటుంది. ఇక సామాన్యుడికి సైతం రైలు ప్రయాణం అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఛార్జీలు తక్కువగా ఉండటంతో చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఇక రైలులు దూర ప్రయాణం చేసే వారు హాయిగా నిద్రిస్తుంటారు. అలా నిద్రిస్తుంటే స్టేషన్ ఎక్కడ దాటి పోతుందేమోన్న భయం కూడా కొందరిలో ఉంటుంది. ఒక వేళ రాత్రి సమయాల్లో స్టేషన్ దిగాల్సి వస్తే నిద్రించే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒక వేళ నిద్ర వచ్చినా నిద్రించకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే నిద్రిస్తే మీరు దిగే స్టేషన్ దాటిపోతే పరిస్థితి వేరేలా ఉంటుంది. తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. ఇలా రైలులో నిద్రించే వారి కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు రైలులో నిద్రించినా ఎలాంటి సమస్య ఉండదు. ఈ సందర్భంగా కొత్త సేవను ప్రారంభించింది. దేశంలోని అన్ని స్టేషన్లలో వై-ఫై, ఎస్కలేటర్లతో సహా అన్ని సౌకర్యాలు ప్రారంభించబడ్డాయి. ఇప్పుడు భారతీయ రైల్వే రాత్రిపూట ప్రయాణించే వారి కోసం అద్భుతమైన సేవను ప్రారంభించింది. ఈ సదుపాయంతో ఇప్పుడు మీరు రైలులో ప్రశాంతంగా నిద్రించగలుగుతారు. మీరు దిగాలనుకుంటున్న స్టేషన్‌లో దిగేందుకు ఉపయోగపడనుంది.
మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు నిద్రిస్తుంటే స్టేషన్ రాకకు 20 నిమిషాల ముందు మీరు మేల్కొంటారు. రైల్వే శాఖ ప్రారంభించిన ఈ సర్వీస్ పేరు ‘డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం’. రైలులో నిద్రపోతున్న వారి కోసం రైల్వే శాఖ ఈ సేవను ప్రారంభించింది. ఈ నిద్ర సమస్య నుంచి బయటపడేందుకు రైల్వేశాఖ ‘డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం’ సదుపాయాన్ని ప్రారంభించింది. ఇందు కోసం రైల్వే 139 నంబను కేటాయిస్తూ సేవను ప్రారంభించింది. దీని కింద ప్రయాణికుడు విచారణ వ్యవస్థ నంబర్ 139లో అలర్ట్ సౌకర్యం పొందవచ్చు. ఈ సౌకర్యం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ప్రయోజనం ఏమిటంటే మీరు స్టేషన్ రాకకు 20 నిమిషాల ముందు మీకు అలారం మోగుతుంటుంది. దీని వల్ల మీరు ముందస్తుగా అలర్ట్ అయి మీరు దిగాల్సిన స్టేషన్‌లో దిగవచ్చు.
ఈ సేవను ఎలా పొందాలి?
డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారంను ప్రారంభించడానికి మీరు IRCTC హెల్ప్‌లైన్ 139కి కాల్ చేయాలి. భాషను ఎంచుకున్న తర్వాత, మీరు గమ్యస్థాన హెచ్చరిక కోసం ముందుగా 7 నంబర్‌లను, ఆపై 2 నంబర్‌లను నొక్కాలి. తర్వాత మీ 10 అంకెల పీఎన్‌ఆర్ నెంబర్‌ను నమోదు చేయండి. దీన్ని నిర్ధారించడానికి 1 డయల్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు స్టేషన్ చేరుకోవడానికి 20 నిమిషాల ముందు వేకప్ అలర్ట్ పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి