AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Connection: ఉజ్వల పథకం కింద ఉచిత ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌లో మార్పులు జరుగనున్నాయా..? దరఖాస్తు చేసుకోవడం ఎలా?

దేశంలో ప్రతి ఒక్కరు కట్టెల పొయ్యిపై వంట చేసుకోకుండా ఉండేందుకు ఈ ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ పథకాన్ని ప్రారంభించారు ప్రధాని మోడీ. కట్టెల పొయ్యిపై వంట చేసుకోవడం..

LPG Connection: ఉజ్వల పథకం కింద ఉచిత ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌లో మార్పులు జరుగనున్నాయా..? దరఖాస్తు చేసుకోవడం ఎలా?
Ujjwala Lpg Gas Connection Scheme
Subhash Goud
|

Updated on: Nov 05, 2022 | 11:40 AM

Share

దేశంలో ప్రతి ఒక్కరు కట్టెల పొయ్యిపై వంట చేసుకోకుండా ఉండేందుకు ఈ ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ పథకాన్ని ప్రారంభించారు ప్రధాని మోడీ. కట్టెల పొయ్యిపై వంట చేసుకోవడం వల్ల పొగ వల్ల కంటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో అందరి ఇళ్లలో గ్యాస్‌ కనెక్షన్‌ ఉండాలనే ఉద్దేశంతో ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్‌ను అందిస్తోంది కేంద్రం. దేశంలో నిరుపేదలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ కనెక్షన్‌ సదుపాయాన్ని ప్రవేశపెట్టడంతో చాలా మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్‌లు అందాయి. మీరు కూడా ఉచిత ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన తీసుకోవాలని ప్లాన్‌ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం కింద ఉచిత ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ పొందవచ్చు.

ప్రభుత్వం నుంచి ఉచితంగా సిలిండర్‌

కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం కింద వినియోగదారులకు 14.2 కిలోల సిలిండర్‌, స్టవ్‌ అందజేస్తున్నారు. దీని ధర దాదాపు 3200 రూపాయలు. ప్రభుత్వం నుండి 1600 రూపాయల సబ్సిడీ లభిస్తుంది. అయితే 1600 రూపాయలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) అడ్వాన్స్‌గా ఇస్తాయి. అయితే ఏఎంసీలు రీఫిల్‌లపై సబ్సిడీ మొత్తాన్ని ఈఎంఐ రూపంలో వసూలు చేస్తాయి.

కోటి కొత్త కనెక్షన్లు:

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో 1 కోటి కొత్త కనెక్షన్లు ఇస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల తరపున ముందస్తు చెల్లింపు నమూనాను మార్చే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో కొత్త కనెక్షన్ల కోసం సబ్సిడీకి సంబంధించిన ప్రస్తుతం ఉన్న విధానంలో మార్పులు చేయవచ్చు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ రెండు కొత్త విధానాలకు సంబంధించిన పనులను ప్రారంభించిందని, త్వరలో విడుదల చేయనున్నట్లు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ముందస్తు చెల్లింపు విధానం మారుతుందా..?

నివేదికల ప్రకారం.. ముందస్తు చెల్లింపు సంస్థ ఏకంగా రూ.1600 వసూలు చేస్తుంది. ప్రస్తుతం ఆయిల్‌ కంపెనీలు ఈఎంఐ రూపంలో అడ్వాన్స్ మొత్తాన్ని వసూలు చేస్తాయి. ఈ పథకంలో ప్రభుత్వం మిగిలిన 1600 సబ్సిడీని ఇస్తోంది. ఈ ముందస్తు చెల్లింపు విధానంలో త్వరలో మార్పులు జరిగే అవకాశం ఉంది.

ఉజ్వల పథకంలో ఎలా నమోదు చేసుకోవాలి

  • ఉజ్వల పథకం కింద బీపీఎల్‌ కుటుంబానికి చెందిన ఒక మహిళ గ్యాస్ కనెక్షన్ పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • pmujjwalayojana.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు ఈ పథకం గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.
  • మీరు రిజిస్ట్రేషన్ కోసం ఒక ఫారమ్‌ను పూరించి దానిని సమీపంలోని ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌కు ఇవ్వాలి. ఈ ఫారమ్‌లో దరఖాస్తు చేసుకున్న మహిళ తన పూర్తి చిరునామా, జన్ ధన్ బ్యాంక్ ఖాతా, కుటుంబ సభ్యులందరి ఆధార్ నంబర్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
  • దీని తర్వాత చమురు మార్కెటింగ్ కంపెనీలు అర్హులైన లబ్ధిదారునికి LPG కనెక్షన్‌ను జారీ చేస్తాయి. వినియోగదారు EMIని ఎంచుకుంటే, EMI మొత్తం సిలిండర్‌పై పొందే సబ్సిడీకి అనుగుణంగా సర్దుబాటు చేయబడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి