Indian Railways: రైలు టికెట్‌ ఉన్న ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయ్యిందా..? జరిమానా తప్పదా..?  రైల్వే అధికారులు ఏమంటున్నారు?

దేశంలో అతిపెద్ద వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ప్రతి రోజు కోట్లాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతుంది. సామాన్యుడు సైతం రైలు ప్రయాణాన్ని..

Indian Railways: రైలు టికెట్‌ ఉన్న ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయ్యిందా..? జరిమానా తప్పదా..?  రైల్వే అధికారులు ఏమంటున్నారు?
Indian Railway Ticket
Follow us
Subhash Goud

|

Updated on: Nov 05, 2022 | 12:32 PM

దేశంలో అతిపెద్ద వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ప్రతి రోజు కోట్లాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతుంది. సామాన్యుడు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటాడు. ఎందుకంటే ఇతర ఛార్జీలకంటే రైలు ఛార్జీలు చాలా తక్కువ. అందుకే రైళ్లు ఎప్పుడు ప్రయాణికులతో రద్దీగా తిరుగుతుంటాయి. రైళ్లు ప్రతి రోజు వేలాది కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంటాయి. అయితే రైలు ప్రయాణం చేసేవారు చాలా మంది ముందస్తుగా ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్‌ చేసుకుంటారు. అయితే బుక్‌ చేసుకున్న రైలు టికెట్ల కాపీని మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని ఉంచుకుంటారు. రైలు ప్రయాణంలో టీసీ వచ్చినప్పుడు మొబైల్‌లో ఉండే హార్డ్‌ కాపీని చూపిస్తారు. అయితే ప్రయాణ సమయంలో చాలా సార్లు ఫోన్స్ స్విచాఫ్ అవుతుంటాయి. చార్జింగ్‌ లేకపోవడంతోనో, ఇతర కారణాల వల్ల స్విచ్చాఫ్‌ అవుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో టీసీ వస్తే మొబైల్‌లో టికెట్‌ కాపీ ఉన్నా.. ఫోన్‌ స్విచ్చాఫ్‌ కారణంగా టికెట్‌ లేకుండా ప్రయాణించే వారవుతారు. ఆ సమయంలో టెన్షన్‌ పడాల్సి వస్తుంటుంది. టికెట్‌ను టీసీకి చూపించడం కష్టంగా ఉంటుంది. టీసీకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది.

చాలా మంది రైలు ప్రయాణం చేసే సమయంలో టికెట్‌ హార్డ్‌ కాపీని తీసుకోరు. పైగా పీఎన్‌ఆర్‌ నెంబర్‌ కూడా గుర్తించుకోరు.చాలా మంది టికెట్ హార్డ్ కాపీని తీసుకోరు. టికెట్ PNR నంబర్ కూడా గుర్తుపెట్టుకోరు. ఇలాంటి సమయంలోఫోన్ ఆఫ్ అయితే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఏం చేయాలి? రైల్వే అధికారులు ఏమంటున్నారో చూద్దాం.

ఈ సందర్భంగా ఈ విషయంపై రైల్వే అధికారులు మాట్లాడుతూ.. ప్రయాణికులు రైలు ఎక్కిన తర్వాత టికెట్‌ ఉన్న ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ కావడం, అలాగే పీఎన్‌ఆర్‌ నెంబర్‌ కూడా గుర్తించుకోకపోవడం వంటివి జరుగుతుంటాయి. అలాంటి సమయంలో రైలు ఎక్కిన ప్రయాణికుడిని ‘టికెట్‌లెస్ ట్రావెలర్‌’గా పరిగణిస్తాము. ఇందుకు టికెట్‌ చూపించని కారణంగా అతనికి జరిమానా విధించాల్సి ఉంటుందని అన్నారు.

ఇవి కూడా చదవండి

టికెట్‌ హార్డ్‌ కాపీని దగ్గర ఉంచుకోవడం తప్పనిసరి:

ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రయాణికుడికి జరిమానా విధించకుండా ఉండాలని టికెట్‌ హార్డ్‌ కాపీని దగ్గర ఉంచుకోవడం తప్పనిసరి. అలాంటి సమయంలో ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయినా ఎలాంటి, పీఆఎన్‌ఆర్‌ నెంబర్‌ గుర్తించుకోకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటి సమయంలో టికెట్‌ హార్డ్‌ కాపీ ఉపయోగపడుతుంది.

ఆన్‌లైన్‌లో రైలు టికెట్లను బుక్‌ చేసుకున్న చాలా మంది ప్రయాణికులు ప్రింట్‌ తీసుకోరు. ఫోన్‌ ఉంది కదా అని నిర్లక్ష్యంగా ఉంటారు. ఇలాంటి సందర్భాలలో ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయితే టీసీ వచ్చినప్పుడు టికెట్‌ చూపించలేరు. పైగా జరిమానా చెల్లించుకోక తప్పదు. అందుకే హార్డ్‌ కాపీ వెంట ఉంటే జరిమానా చెల్లించడం తప్పుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!