Post Office Scheme: పోస్టాఫీసుల్లో అద్భుతమైన స్కీమ్‌.. ఐదేళ్లలో 14 లక్షల రాబడి

పోస్టాఫీసుల్లో రకరకాల పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇకప్పుడు ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు.. ఇప్పుడు ప్రజలకు మరింతగా దగ్గరయ్యే పథకాలను రూపొందిస్తోంది..

Post Office Scheme: పోస్టాఫీసుల్లో అద్భుతమైన స్కీమ్‌.. ఐదేళ్లలో 14 లక్షల రాబడి
Post Office Scheme
Follow us
Subhash Goud

|

Updated on: Nov 05, 2022 | 8:26 AM

పోస్టాఫీసుల్లో రకరకాల పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇకప్పుడు ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు.. ఇప్పుడు ప్రజలకు మరింతగా దగ్గరయ్యే పథకాలను రూపొందిస్తోంది. బ్యాంకుల మాదిరిగానే పొదుపు పథకాలను తీసుకువస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే స్కీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. పోస్టల్‌ కస్టమర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఓ స్కీమ్‌ ద్వారా 5 ఏళ్లలో ఏకంగా రూ.14 లక్షల వరకు రాబడి పొందవచ్చు. అయితే పోస్టాఫీసు స్కీమ్స్‌ ఎప్పటికీ సురక్షితంగానే ఉంటాయి. అన్ని పథకాలకు సెక్యూరిటీ ఉంటుంది. అద్భుతమైన రిటర్న్స్‌ ఉంటాయి. ఇలాంటి పథకాలలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం వల్ల లక్షాధికారులు కావచ్చు. పోస్టాఫీసు సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లో 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. అంటే ఐదేళ్ల కాలంలో 14 లక్షల వరకు సంపాదించుకోవచ్చు.

మీరు రిటైర్‌మెంట్‌ అయి ఉంటే పోస్టాఫీసుల్లో అద్భుతమైన స్కీమ్స్‌ ఉన్నాయి. ఈ పథకంలో ప్రయోజనాలు సేవింగ్స్‌ స్కీమ్‌ అందుబాటులో ఉంది. సంపాదించిన డబ్బును పోస్టాఫీసుల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే అధిక లాభాలు అందుకోవచ్చు. సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలంటే వయసు 60 ఏళ్లు, లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా వీఆర్ఎస్ తీసుకున్నవాళ్లు కూడా ఈ పథకంలో చేరవచ్చు.

ఐదేళ్లలో 14 లక్షలు ఎలా..?

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌లో మీరు ఒకేసారి రూ.10 లక్షల వరకు ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే ఏడాదికి 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ లెక్కన ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మొత్తం రూ.14,28,964 పొందవచ్చు. ఇందులో రూ.4,28,964 వరకు వడ్డీ అందుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

1000 రూపాయలకే ఖాతా ఓపెన్‌

ఈ సీనియర్‌ సిటిజన్స్ స్కీమ్‌లో కనీస మొత్తం రూ.1000లతో ఖాతాను ఓపెన్ చేయవచ్చు. గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్‌మెంట్‌ చేసుకోవచ్చు. అకౌంట్‌ ఓపెన్ చేసేందుకు లక్ష రపాయల కంటే తక్కువ ఉంటే క్యాష్‌ రూపంలో ఇవ్వవచ్చు. లక్షకుపైగా ఉంటే తప్పకుండా చెక్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. ఒక వేళ మీరు ఇంకొంత కాలం పొడిగించాలనుకుంటే పొడిగించుకునే వెసులుబాటు ఉంది. మెచ్యూరిటీ తరువాత ఈ స్కీమ్‌ను మరో మూడేళ్లకు పెంచవచ్చు. దీనికోసం పోస్టాఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పన్ను మినహాయింపు:

ఈ సేవింగ్స్‌ స్కీమ్‌లో మీకు వచ్చే వడ్డీ ఏడాదికి రూ.10 వేల కంటే ఎక్కువ ఉన్నట్లయితే టీడీఎస్‌ కట్‌ అవుతుంది. ఈ స్కీమ్‌లో పెట్టిన పెట్టుబడికి సెక్షన్‌ 80సీ ప్రకారం ట్యాక్స్‌ మినహాయింపు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!