- Telugu News Photo Gallery Business photos Airtel payment bank services using whatsapp check here for full details Telugu Business News
Bank News: ఎయిర్‌టెల్ పేమెంట్స్ నుంచి వాట్సాప్ సేవలు.. ఎలా ఉపయోగించుకోవాలంటే..
అన్ని బ్యాంకులు వాట్సాప్ ద్వారా సేవలు పొందే అవకాశం కల్పిస్తున్న తరుణంలో ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ కూడా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఈ సేవలను ఎలా పొందాలంటే..
Updated on: Nov 06, 2022 | 10:06 AM

మారుతోన్న కాలానికి అనుగుణంగా బ్యాంకింగ్ రంగంలోనూ సమూల మార్పులు వస్తున్నాయి. అన్ని రంగాల్లో టెక్నాలజీ వినియోగం పెరిగినట్లే బ్యాంకింగ్ రంగంలోనూ సాంకేతికను ఉపయోగం పెరిగింది. లావాదేవీల కోసం బ్యాంక్‌కు వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లోనే కూర్చొని బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు.

ఆన్‌లైన్ బ్యాంకింగ్, యాప్ బ్యాంకింగ్‌తో పాటు వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, హెచ్‌డిఎఫ్‌సి, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు మరికొన్ని బ్యాంకుల్లో వాట్సాప్ సేవలను ప్రారంభించాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఎయిర్‌టెల్ పేమేంట్స్ బ్యాంక్ కూడా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి వాట్సాప్ ద్వారా బ్యాంక్ సేవలను పొందొచ్చు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ వాట్సాప్ సేవల ద్వారా బ్యాలెన్స్ చెకప్, ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్, మొబైల్ బిల్ రీఛార్జ్, యుటిలిటీ బిల్లు చెల్లింపు, లోన్ అప్లికేషన్‌తో 24*7 బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు వాట్సాప్ సేవలను పొందడానికి ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో 8800688006 నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. అనంతరం పేమెంట్స్ బ్యాంకులో రిజిస్టర్ చేసుకున్న నెంబర్ ద్వారా హాయ్ అని మెసేజ్ చేయాలి.

అనంతరం వాట్సాప్‌లో అందిస్తోన్న పలు సేవలు ప్రత్యక్షమవుతాయి. తర్వాత కావాల్సిన సేవలను ఉపయోగించుకోవచ్చు.




