AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero MotoCorp: భారత్‌లో భారీగా పెరిగిన హీరో మోటోకార్ప్‌ బైక్‌ల ధరలు.. కొత్త ధరల వివరాలు ఇవే..!

Hero MotoCorp: వాహన రంగాలలో అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. ఒక వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సతమతమవుతుంటే.. వాహనాల ధరలు సైతం పెంచుతున్నాయి..

Hero MotoCorp: భారత్‌లో భారీగా పెరిగిన హీరో మోటోకార్ప్‌ బైక్‌ల ధరలు.. కొత్త ధరల వివరాలు ఇవే..!
Subhash Goud
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 29, 2021 | 11:46 AM

Share

Hero MotoCorp: వాహన రంగాలలో అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. ఒక వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సతమతమవుతుంటే.. వాహనాల ధరలు సైతం పెంచుతున్నాయి కంపెనీలు. కరోనా మహమ్మారి కాలంలో విక్రయాలు తగ్గుముఖం పట్టగా, ప్రస్తుతం కరోనా తగ్గిపోవడంతో మళ్లీ వ్యాపారాలు జోరందుకున్నాయి. అందుకు ముడి సరుకుల ధరలు పెరుగుతున్న కారణంగా ధరలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా ద్విచక్ర వాహన తయారీ దేశీయ దిగ్గజ సంస్థ హీరో మోటోకార్ప్‌ తమ అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా భారత టూవీలర్‌ రంగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్ప్లెండర్‌ బైక్‌ ధరలను పెంచేసింది. ఈ పెరిగిన ధరలు సెప్టెంబర్‌ 20 నుంచి అ‍మలుల్లోకి వచ్చాయి. భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన స్ప్లెండర్ బైక్‌ ధరలను హీరో మోటోకార్ప్‌ సవరించింది. పెరుగుతున్న ముడి సరుకుల ధరలను దృష్టిలో ఉంచుకొని బైక్ల ధరలను పెంచినట్లు హీరో మోటోకార్ప్‌ ప్రకటించింది. స్ప్లెండర్‌ బైక్‌ ధరలు సుమారు వెయ్యి నుంచి రెండు వేల వరకు హీరో మోటోకార్ప్‌ పెంచింది. అంతేకాకుండా మాస్ట్రో ఎడ్జ్‌, డెస్టినీ 125 , ప్లెజర్‌ ప్లస్‌ స్కూటీ ధరలు కూడా పెరిగాయి.

హీరో మోటోకార్ప్‌ కొత్త ద్విచక్ర వాహనాల ధరలు:

► స్ప్లెండర్ ఐస్మార్ట్ డ్రమ్, అల్లాయ్ పాత ధర రూ.68,650 ఉండగా, కొత్త ధర రూ.69,650కి చేరింది.

► స్ప్లెండర్ ప్లస్‌ సెల్ప్‌, డ్రమ్‌, అల్లాయ్‌ పాత ధర రూ.67,210 ఉండగా, కొత్త ధర రూ.68,360 ఉంది.

► స్ప్లెండర్ ప్లస్‌ సెల్ప్‌, డ్రమ్‌, అల్లాయ్‌ పాత ధర రూ.66,050 ఉండగా, కొత్త ధర రూ.67,160కి చేరింది.

► స్ప్లెండర్ ప్లస్‌ బ్లాక్‌ అండ్‌ అసెంట్‌ సెల్ప్‌, డ్రమ్‌, అల్లాయ్‌ పాత ధర రూ.67,260 ఉండగా, కొత్త ధర రూ.68,860కి చేరింది.

► సూపర్‌ స్ప్లెండర్ డ్రమ్‌, అల్లాయ్‌ పాత ధర రూ.72,600 ఉండగా, కొత్త ధర రూ.73,900లకు చేరింది.

► సూపర్‌ స్ప్లెండర్ డిస్క్‌, అల్లాయ్‌ పాత ధర రూ.75,900 ఉండగా, కొత్త ధర రూ.77,600 ఉంది.

► మాస్ట్రో ఎడ్జ్‌ 125 అల్లాయ్‌ డ్రమ్‌ పాత ధర రూ.72,250 ఉండగా, కొత్త ధర రూ.73,450 ఉంది.

► మాస్ట్రో ఎడ్జ్‌ 125 అల్లాయ్‌ డిస్క్‌ ప్రిస్మాటిక్‌ కనెక్ట్‌ పాత ధర రూ.79,750 ఉండగా, కొత్త ధర రూ. 81,900లకు చేరింది.

► మాస్ట్రో ఎడ్జ్‌ 125 అల్లాయ్‌ డిస్క్‌ పాత ధర రూ.76,500 ఉండగా, కొత్త ధర రూ.77,900లకు చేరింది.

► డెస్టినీ 125 స్టీల్ డ్రమ్ పాత ధర రూ.69,500 ఉండగా, కొత్త ధర రూ.70,400 ఉంది.

► డెస్టినీ 125 అల్లాయ్ డ్రమ్ VX ప్లాటినం పాత ధర రూ.74,700 ఉండగా, కొత్త ధర రూ.75,900లకు చేరింది.

► డెస్టినీ 125 100 మిలియన్ ఎడిషన్ పాత ధర రూ.74,750 ఉండగా, కొత్త ధర రూ.75,500 ఉంది.

► మాస్ట్రో ఎడ్జ్ 110 అల్లాయ్ డ్రమ్ VX పాత ధర రూ.64,250 ఉండగా, కొత్త ధర రూ.65,900లకు చేరింది.

► ప్లెజర్ ప్లస్ ప్లాటినం అల్లాయ్ డ్రమ్ ZX పాత ధర రూ. 64,950 ఉండగా, కొత్త ధర రూ.66,400లకు చేరింది.

► ప్లెజర్ ప్లస్ స్టీల్ డ్రమ్ LX పాత ధర రూ.60,500 ఉండగా, కొత్త ధర రూ.61,900లకు చేరింది.

► ప్లెజర్ ప్లస్ అల్లాయ్ డ్రమ్ VX పాత ధర రూ.62,850 ఉండగా, కొత్త ధర రూ.64,200లకు చేరింది.

ఇవీ కూడా చదవండి:

Electric Scooter: ఒక్కసారి చార్జ్‌ చేస్తే 480 కిలోమీటర్లు.. మార్కెట్లోకి రానున్న మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..!

No Cost EMI: ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారా..? నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ వల్ల కలిగే లాభాలు ఏమిటి..?

Toyota Yaris: భారత్‌లో టొయోటా యారిస్ కార్ల విక్రయాల నిలిపివేత.. కారణం ఏంటంటే..!