Tarform Luna Motorcycle: లూనా పేరుతో కొత్త ఈ-బైక్.. లుక్ చూస్తే షేక్.. ధర తెలిస్తే షాక్..

లూనా పేరు వినగానే మనకు పాత కాలం నాటి స్కూటర్ గుర్తొస్తుంది. ఇదే పేరుతో ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా వస్తుందని పలు ఆన్ లైన్ నివేదికలు తెలిపాయి. అయితే ఈ పేరుతో ఓ కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ వచ్చింది. దీనిని టార్‌ఫార్మ్ అనే కంపెనీ తయారు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి..

Tarform Luna Motorcycle: లూనా పేరుతో కొత్త ఈ-బైక్.. లుక్ చూస్తే షేక్.. ధర తెలిస్తే షాక్..
Tarform Luna Cafe
Follow us

|

Updated on: Aug 31, 2024 | 5:17 PM

లూనా పేరు వినగానే మనకు పాత కాలం నాటి స్కూటర్ గుర్తొస్తుంది. ఇదే పేరుతో ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా వస్తుందని పలు ఆన్ లైన్ నివేదికలు తెలిపాయి. అయితే ఈ పేరుతో ఓ కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ వచ్చింది. దీనిని టార్‌ఫార్మ్ అనే కంపెనీ తయారు చేసింది. కళ్లకు కట్టే డిజైన్‌లను తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన న్యూయార్క్ నగరానికి చెందిన స్వీడిష్ డిజైనర్ తారాస్ క్రావ్‌ట్‌చౌక్ ఆధ్వర్యంలో టార్‌ఫార్మ్ అనే కంపెనీ పనిచేస్తోంది. ఈ టార్‌ఫార్మ్ ఇప్పుడు ఓ ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకొచ్చింది. దీని పేరు టార్‌ఫార్మ్ లూనా. దీనికిక సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రెండు వేరియంట్లలో..

లూనా రెండు అవతార్‌లలో అందుబాటులో ఉంది. అవి స్క్రాంబ్లర్‌, కేఫ్ రేసర్‌. ఈ రెండు మోటార్‌సైకిళ్లు లుక్ పరంగా చాలా భిన్నంగా ఉంటాయి కానీ ఒకే విధమైన అండర్‌పిన్నింగ్‌లను కలిగి ఉంటాయి. స్పెక్స్ గురించి పరిశీలిస్తే.. ఈ లూనా ఎలక్ట్రిక్ బైక్ లో 11.2కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 75పీఎస్, 60ఎన్ఎం గరిష్ట టారర్క్ ను ఉత్పత్తి చేసే ఎయిర్-కూల్డ్ మోటారును పొందుతుంది. 200కిలోల బరువుతో, లూనా కేవలం 3.8 సెకన్లలో 0-100కిమీల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 200కిమీ వేగంతో దూసుకుపోతుంది. బ్యాటరీ నగర పరిధిలో సుమారు 160కిమీల పరిధిని అందిస్తుంది. 220వాట్ల ఛార్జర్ ద్వారా కేవలం 2 గంటల్లో నే ఇది పూర్తిగా చార్జ్ అవుతుంది.

లూనా లుక్..

లుక్ పరంగా చూస్తే.. లూనా స్క్రాంబ్లర్ క్లాసిక్, అన్‌కవర్డ్ హెడ్‌లైట్, స్పోక్డ్ వీల్స్, ఆఫ్-రోడ్ టైర్‌లను కలిగి ఉంది. అలాగే లూనా రేసర్ ఒక సొగసైన కేఫ్ రేసర్‌ను పోలి ఉంటుంది . ఇది హాఫ్-ఫెయిరింగ్, దృఢమైన సస్పెన్షన్, అవియాన్స్ స్పిరిట్ ఎస్టీ టైర్‌లతో కూడిన హెడ్‌లైట్‌ను కలిగి ఉంది. డిస్క్ బ్రేకులు కలిగి ఉంటుంది. టార్‌ఫార్మ్ వారి సొంత ‘టార్‌ఫార్మ్ ఆపరేటింగ్ సిస్టమ్’ను కలిగి ఉంటుంది. ఇది ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లు, మెషిన్ లెర్నింగ్, సెన్సార్ టెక్నాలజీతో వస్తుంది. బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, అవసరమైతే బ్రేక్‌లను వర్తింపజేయమని మీకు హెచ్చరికను అందించే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. 3.4-అంగుళాల ఎల్ఈడీ డిస్ప్లేను పొందుతుంది.

పూర్తి పర్యావరణ హితం..

టార్‌ఫార్మ్ లూనా తయారీలో కార్బన్ ఫైబర్‌ను ఉపయోగించకుండా ఫ్లాక్స్ ఫైబర్‌ను ఉపయోగించారు. ఇది మొక్కల ఆధారిత పదార్థం, ఉత్పత్తి చేయడానికి చాలా తక్కువ శక్తి అవసరం. టార్ఫార్మ్ బాడీ పెయింట్ కోసం ఆల్గే పిగ్మెంట్‌ని ఉపయోగించారు. ఇది మోటార్‌సైకిల్‌పై ఇంతకు ముందెన్నడూ చేయలేదు. లెదర్ సీటు కూడా నిజమైన లెదర్‌తో తయారు చేయలేదు. ఇది మొక్కల వ్యర్థాల వంటి బయోడిగ్రేడబుల్ ప్రత్యామ్నాయాల నుంచి తయారైంది.

మన దేశంలో లేదు..

ఈ లూనా బైక్ మన దేశంలో అందుబాటులో లేదు. కేవలం యూఎస్ మార్కెట్ వరకూ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర మన కరెన్సీలో రూ. 20లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఇప్పుడు ఆర్డర్ చేస్తే డెలివరీ కావడానికి నాలుగు నుంచి ఆరు నెలలు పడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్