AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cibil score: పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు.. అదెలా అంటే..

ఈ స్కోర్ ఎక్కువగా ఉంటే మీరు క్రమశిక్షణతో రుణాన్ని తిరిగి చెల్లించగలరనే నమ్మకం కలుగుతుంది. సాధారణంగా 300 నుంచి 900 లోపు కేటాయిస్తారు. పాన్ కార్డు ద్వారా సిబిల్ స్కోర్ ను తెలుసుకోవచ్చు. అయితే ఆ కార్డు లేకపోయినా తెలుసుకునే అవకాశం ఉంది. అందుకు ఈ కింద తెలిపిన పద్ధతులను పాటిస్తే చాలు.

Cibil score: పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు.. అదెలా అంటే..
Credit Score
Madhu
|

Updated on: Apr 20, 2024 | 5:43 PM

Share

ప్రస్తుతం ఎక్కడ చూసినా సిబిల్ స్కోర్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. దాని ఆధారంగానే వివిధ ఆర్థిక సంస్థలు మనకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. కానీ చాలామందికి దీనిపై సరైన అవగాహన ఉండదు. దానిని ఎలా లెక్కిస్తారో తెలియదు. సిబిల్ స్కోర్ ఎంత ఉందో తెలుసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా సిబిల్ స్కోర్ ను పాన్ కార్డు ఆధారంగా లెక్కిస్తారు. అయితే పాన్ కార్డు లేకుండా కూడా సిబిల్ తెలిసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సిబిల్ స్కోర్ చాలా కీలకం..

మన ఆర్థిక లావాదేవీలలో సిబిల్ స్కోర్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. రుణాల కోసం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలను కలిసినప్పుడు, క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వారు గమనించే ప్రధాన అంశం సిబిల్ స్కోరే. దీనిని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ అందిస్తుంది. దానినే సిబిల్ స్కోర్ అంటారు. ఆర్థిక వ్యవహారాలలో మన క్రమశిక్షణను సూచించే ఈ నంబర్ ఆర్థిక సంస్థలకు చాలా ముఖ్యమైంది.

ఆర్థిక క్రమశిక్షణకు కొలమానం..

గతంలో మీరు తీసుకున్న రుణాలను తిరిగి కట్టిన విధానం, అంటే వాటిని సక్రమంగా చెల్లించారా, లేదా అనే విషయాలపై సిబిల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. ఈ స్కోర్ ఎక్కువగా ఉంటే మీరు క్రమశిక్షణతో రుణాన్ని తిరిగి చెల్లించగలరనే నమ్మకం కలుగుతుంది. సాధారణంగా 300 నుంచి 900 లోపు కేటాయిస్తారు. ఈ నంబర్ మీకు మంజూరు చేసే రుణాలను పెంచుతుంది. సాధారణంగా పాన్ కార్డు ద్వారా సిబిల్ స్కోర్ ను తెలుసుకోవచ్చు. అయితే ఆ కార్డు లేకపోయినా తెలుసుకునే అవకాశం ఉంది. అందుకు ఈ కింద తెలిపిన పద్ధతులను పాటిస్తే చాలు.

ఇలా చేస్తే చాలు..

  • సిబిల్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దానిలో పర్సనల్ సిబిల్ స్కోర్ విభాగానికి వెళ్లాలి.
  • గెట్ యువర్ సిబిల్ స్కోర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, అక్కడ అడిగిన వివరాలను నమోదు చేయాలి.
  • మీకు పాన్ కార్డు లేకపోతే పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్ తదితర గుర్తింపు పత్రాలను ఉపయోగించవచ్చు. వాటిలో మీరు ఎంచుకున్న కార్డు వివరాలను ఎంటర్ చేయాలి.
  • మీ పుట్టిన తేదీ, పిన్ కోడ్‌ను నమోదు చేసి, మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి. అలాగే మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ గుర్తింపును ధ్రువీకరించడానికి, మీ మొబైల్ పరికరానికి పంపిన ఓటీపీని నమోదు చేయాలి. ఆ తర్వాత కంటిన్యూ బటన్ ప్రెస్ చేయాలి.
  • మీ ఖాతాతో లింక్ అవుతున్నట్టు ఎస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీంతో మీ పని విజయవంతమవుతుంది. స్క్రీన్ పై పేజీ కనిపిస్తుంది. సిబిల్ స్కోర్ తెలుసుకోవడానికి దానిలో గో టు డ్యాప్ బోర్డు పై క్లిక్ చేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..