AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Scooter: లైసెన్స్ అవసరం లేదు.. రిజిస్ట్రేషన్‌తో పనిలేదు.. చీప్ అండ్ బెస్ట్ ఈ-స్కూటర్.. 

హీరో ఎలక్ట్రిక్‌ మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. దాని పేరు హీరో ఎలక్ట్రిక్‌ అట్రియా ఎల్‌ఎక్స్‌. దీనిలో అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన డిజైన్‌ ఉంటుంది. పైగా దీని ధర మిగిలిన ఎలక్ట్రిక్‌ స్కూటర్లతో పోల్చితే సగం ఉంటుంది. అంతేకాక ఈ స్కూటర్‌ డ్రైవ్‌ చేయడానికి ఎటువంటి లైసెన్స్‌ కూడా అవసరం లేదని హీరో ఎలక్ట్రిక్‌ ప్రకటించింది.

Electric Scooter: లైసెన్స్ అవసరం లేదు.. రిజిస్ట్రేషన్‌తో పనిలేదు.. చీప్ అండ్ బెస్ట్ ఈ-స్కూటర్.. 
Hero Electric Atria Lx
Madhu
|

Updated on: Apr 20, 2024 | 6:16 PM

Share

ఎలక్ట్రిక్‌ వాహన శ్రేణికి మన దేశంలో గిరాకీ బాగా పెరిగింది. పూర్తి పర్యావరణ హితం కావడం, అత్యాధునిక ఫీచర్లు ఉండటంతో పాటు ఇంధన ఖర్చును అమాంతం తగ్గించేస్తుండటంతో అందరూ వీటి బాట పడుతున్నారు. వాస్తవానికి వీటి ధరలు సంప్రదాయ ఇంధన స్కూటర్లతో పోల్చితే కాస్త ఎక్కువగానే ఉన్నా.. వీటిపై ప్రజలు మొగ్గుచూపడానికి ప్రధాన కారణం ఇదే. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు మన దేశీయ మార్కెట్లో బాగా అమ్మడవుతున్నాయి. వాటిల్లో టాప్‌ కంపెనీలు అయినా ఓలా, ఏథర్‌, టీవీఎస్‌, హీరో వంటివి ఉన్నాయి. ఈ క్రమంలో హీరో ఎలక్ట్రిక్‌ మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. దాని పేరు హీరో ఎలక్ట్రిక్‌ అట్రియా ఎల్‌ఎక్స్‌. దీనిలో అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన డిజైన్‌ ఉంటుంది. పైగా దీని ధర మిగిలిన ఎలక్ట్రిక్‌ స్కూటర్లతో పోల్చితే సగం ఉంటుంది. అంతేకాక ఈ స్కూటర్‌ డ్రైవ్‌ చేయడానికి ఎటువంటి లైసెన్స్‌ కూడా అవసరం లేదని హీరో ఎలక్ట్రిక్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ స్కూటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎల్‌ఎక్స్‌: వేగం

స్కూటర్ అయినా, బైక్ అయినా.. వాటికి వేగం ముఖ్యం. అయితే ఈ స్కూటర్ మాత్రం లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని కారణంగా, దీని కోసం మీకు ఎలాంటి లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. లో స్పీడ్‌ అన్నం కదా అని మరీ ఎద్దులబండిలా ఉండదు లెండి. ఈ స్కూటర్ వేగం గంటకు 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో అయితే ప్రయాణించగలుగుతుంది. ఈ స్కూటర్‌ను నడపడానికి మీకు ఎలాంటి ఎలాంటి లైసెన్స్ అలాగే బండికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎల్‌ఎక్స్‌: రేంజ్‌

హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎల్‌ఎక్స్‌ స్కూటర్లో ఆకట్టుకునే అంశం రేంజ్‌. ఈ స్కూటర్‌లో కంపెనీ 51.2V/30Ah బ్యాటరీ ప్యాక్‌ను ఇన్‌స్టాల్ చేసింది. ఈ స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 110 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు. స్కూటర్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది.

హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎల్‌ఎక్స్‌: డిజైన్‌

హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎల్‌ఎక్స్‌ స్కూటర్‌ ఆకర్షణీయమైన, స్టైలిష్ లుక్‌కి వస్తోంది. ఈ స్కూటర్ ఆధునిక డిజైన్‌ను చూసిన తర్వాత మీరు దానితో ప్రేమలో పడతారని కంపెనీ జోస్యం చెబుతోంది. ఈ స్కూటర్‌లో మీకు ఎల్‌ఈడీ హెడ్‌లైట్, టెయిల్‌లైట్ కూడా అందించారు. దీని డిజైన్‌పై చాలా మంది వినియోగదారులు సంతోషంగానే ఉన్నారు. మీరు మీ రోజువారీ జీవితంలో స్కూటర్‌ని ఉపయోగించాలనుకుంటే, ఇది మీకు మంచి ఎంపిక.

హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎల్‌ఎక్స్‌: ధర

హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎల్‌ఎక్స్‌ స్కూటర్ ధర గురించి మాట్లాడితే మీరు ఈ స్కూటర్ చాలా చవకైనది. ఈ స్కూటర్ ధర రూ. 70,000, అయితే ప్రస్తుత ఆఫర్ ప్రకారం, ఇది కేవలం రూ. 60,000కే కొనుగోలు చేయొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..