Jio: మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్

మీరు ఐపీఎల్‌ మ్యాచ్‌ని చూడటానికి జియో డేటా రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? మీకు డేటా సరిపోవడం లేదా? ఇందు కోసం కస్టమర్లకు ప్రత్యేక డేటా ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది. డేటా రీఛార్జ్ అవసరాలను తీర్చే రూ.15 నుండి ప్రారంభమయ్యే చౌక డేటా రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం. జియో డేటా టాప్‌అప్ ప్లాన్ రూ. 15 నుండి ప్రారంభమవుతుంది. జియో డేటా ప్లాన్‌ల ధర రూ..

Jio: మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
Jio
Follow us

|

Updated on: Apr 20, 2024 | 5:38 PM

మీరు ఐపీఎల్‌ మ్యాచ్‌ని చూడటానికి జియో డేటా రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? మీకు డేటా సరిపోవడం లేదా? ఇందు కోసం కస్టమర్లకు ప్రత్యేక డేటా ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది. డేటా రీఛార్జ్ అవసరాలను తీర్చే రూ.15 నుండి ప్రారంభమయ్యే చౌక డేటా రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం. జియో డేటా టాప్‌అప్ ప్లాన్ రూ. 15 నుండి ప్రారంభమవుతుంది. జియో డేటా ప్లాన్‌ల ధర రూ.15, రూ.19, రూ.25, రూ.29, రూ.61. ఇందులో 1జీబీ డేటా నుంచి 6జీబీ మొబైల్ డేటా అందుబాటులో ఉంటుంది.

1. జియో రీఛార్జ్ రూ. 15

జియోకు చెందిన రూ. 15 డేటా వోచర్ ప్లాన్ మీకు 1జీబీ అదనపు డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ చెల్లుబాటు మీ ప్రస్తుత ప్లాన్‌కి సమానంగా ఉంటుంది. మీ రోజువారీ డేటా అయిపోయినట్లయితే మీరు దానిని 1జీబీ అదనపు డేటా కోసం రీఛార్జ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

2. రీఛార్జ్ రూ. 19

జియో మరో బూస్టర్ డేటా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 19 మాత్రమే. ఇందులో సాధారణ డేటాతో పాటు మీకు 1.5జీబీ అదనపు డేటా అందిస్తోంది. ఇది డేటా పరిమితి ముగిసిన తర్వాత మీకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఇందులో మీకు కాల్‌లు, ఎస్‌ఎంఎస్‌లు వంటి ప్రయోజనాలేమి ఉండవని గుర్తించుకోండి.

3. రీఛార్జ్ రూ. 25

రిలయన్స్ జియో కూడా వినియోగదారులకు రూ.25 రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. దీనిలో రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత మీరు 2జీబీ వరకు అదనపు డేటాను పొందుతారు. మీరు ఇప్పటికే ఉన్న మీ రీఛార్జ్ ప్లాన్ చెల్లుబాటులో ఈ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

4. రీఛార్జ్ రూ. 29

ఇది కాకుండా, మీ రోజువారీ డేటా పరిమితిని చేరుకున్నట్లయితే జియో మీకు 29 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఇందులో జియో మీకు 2.5జీబీ అదనపు డేటాను అందిస్తోంది. దీనితో మీరు ఏ ఇతర ప్రయోజనాన్ని పొందలేరు. బదులుగా మీరు ఇప్పటికే ఉన్న ప్లాన్ చెల్లుబాటు ముగిసే వరకు ఉపయోగించవచ్చు.

5. రీఛార్జ్ రూ. 61

కొన్ని ముఖ్యమైన పని కోసం మీకు ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ కావాలంటే, మీరు రూ. 61 డేటా బూస్టర్ ప్లాన్ తీసుకోవచ్చు. మీరు ఇందులో చాలా ప్రయోజనాలను పొందుతారు. అలాగే ఇందులో మీరు 6 జీబీ వరకు డేటాను పొందుతారు. మీరు చెల్లుబాటు అయ్యే వరకు ఉపయోగించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?