AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం

ప్రస్తుతం బ్యాంకింగ్‌ రంగం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఒకప్పుడు బ్యాంకు పని నిమిత్తం వెళ్లాలంటే బ్రాంచ్‌కు వెళ్లాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందిన కారణంగా అన్ని రకాల సేవలు ఇంట్లోనే ఉండి స్మార్ట్‌ఫోన్‌ ద్వారా పొందే అవకాశం ఉంది. అయితే దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన వినియోగదారుల కోసం ఎన్నో సేవలను అందుబాటులోకి

HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
Hdfc
Subhash Goud
|

Updated on: Apr 20, 2024 | 5:00 PM

Share

ప్రస్తుతం బ్యాంకింగ్‌ రంగం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఒకప్పుడు బ్యాంకు పని నిమిత్తం వెళ్లాలంటే బ్రాంచ్‌కు వెళ్లాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందిన కారణంగా అన్ని రకాల సేవలు ఇంట్లోనే ఉండి స్మార్ట్‌ఫోన్‌ ద్వారా పొందే అవకాశం ఉంది. అయితే దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన వినియోగదారుల కోసం ఎన్నో సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా తన కస్టమర్లను అలర్ట్‌ చేసింది. ఏప్రిల్‌ 21వ తేదీన అర్ధరాత్రి అంటే 1.00 గంట నుంచి ఉదయం 6.00 గంటల వరకు పలు సర్వీసులలో అంతరాయం ఏర్పడనున్నట్లు తెలిపింది.

బ్యాంకుకు సంబంధించి సర్వీర్‌లను అప్‌డేట్‌ చేస్తున్న కారణంగా ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలు అందేబాటులో ఉండవని తెలిపింది. NEFT లేదా IMPSల ద్వారా మీ లావాదేవీల పనులను చేసుకోవాలని బ్యాంకు విజ్ఞప్తి చేసింది. అంతరాయం ఏర్పడే సేవలకు వినియోగదారులు సహకరించాలని కోరింది. ఏదైనా సందేహాల కోసం 18001600/18002600 నంబర్‌కు సంప్రదించాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది.

ఇవి కూడా చదవండి
Hdfc Bank

Hdfc Bank