AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హమ్మయ్యా.. ఎట్టకేలకు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి టైమ్‌.. తెలుగు రాష్ట్రాల్లో తులం రేటు ఎంతుందంటే?

పసిడి ప్రియులకు పండగలాంటి వార్త.. అవును.. నిజంగానే.. నిరంతరం కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ఆదివారం అత్యధిక స్థాయి నుండి కాస్త దిగొచ్చింది. ఏడు రోజుల పెరుగుదల తర్వాత దేశ రాజధానిలో బంగారం ధరలు తగ్గాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. ఇది గోల్డ్‌ లవర్స్‌కి గొప్పవార్తే అవుతుంది. అసలే పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో చాలా మంది బంగారం కొనేందుకు వెళ్తున్నారు. ఎప్పుడెప్పుడు ధర కాస్త దిగొస్తుందా అని ఎదురు చూస్తున్నారు సామాన్య, మధ్య తరగతి ప్రజలు.

హమ్మయ్యా.. ఎట్టకేలకు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి టైమ్‌.. తెలుగు రాష్ట్రాల్లో తులం రేటు ఎంతుందంటే?
Gold Price
Jyothi Gadda
|

Updated on: Feb 16, 2025 | 7:44 AM

Share

పసిడి ప్రియులకు పండగలాంటి వార్త.. అవును.. నిజంగానే.. నిరంతరం కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ఆదివారం అత్యధిక స్థాయి నుండి కాస్త దిగొచ్చింది. ఏడు రోజుల పెరుగుదల తర్వాత దేశ రాజధానిలో బంగారం ధరలు తగ్గాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. ఇది గోల్డ్‌ లవర్స్‌కి గొప్పవార్తే అవుతుంది. అసలే పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో చాలా మంది బంగారం కొనేందుకు వెళ్తున్నారు. ఎప్పుడెప్పుడు ధర కాస్త దిగొస్తుందా అని ఎదురు చూస్తున్నారు సామాన్య, మధ్య తరగతి ప్రజలు. భారతదేశంలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.7,890లు కాగా, 24 క్యారెట్ల బంగారం (దీనిని 999 బంగారం అని కూడా పిలుస్తారు) గ్రాముకు రూ. 8,607లుగా ధర పలుకుతోంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 100 మేర తగ్గింది. దీంతో తులం ధర రూ. 78 వేల 900 వద్దకు దిగివచ్చింది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములపై రూ. 109 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ. 86,070 వద్దకు దిగివచ్చింది.

– ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,220 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

– ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,070 వద్ద ఉంది.

– చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,070 వద్ద ఉంది.

– హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,070 వద్ద ఉంది.

– కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,070 వద్ద ఉంది.

– బెంళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,070 వద్ద ఉంది.

– విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,070 వద్ద ఉంది.

– కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,070 వద్ద ఉంది.

వెండి ధరలు: హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు దిగివచ్చినప్పటికీ వెండి రేటు రికార్డ్ స్థాయి వద్దే స్థిరంగా కొనసాగుతోంది. భారతదేశంలో ఈరోజు వెండి ధర గ్రాముకు రూ.100.50లు కాగా, కిలోగ్రాముకు రూ. 1,00,500.లుగా నమోదైంది. భారతదేశంలో వెండి ధర అంతర్జాతీయ ధరల ద్వారా నిర్ణయించబడుతుంది. అవి రెండు వైపులా కదులుతాయి. అంతేకాకుండా, డాలర్‌తో పోలిస్తే రూపాయి కరెన్సీ కదలికపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పడిపోతే, అంతర్జాతీయ ధరలు స్థిరంగా ఉంటే, వెండి మరింత ఖరీదైనదిగా మారుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి