AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి కొబ్బరి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..? ముఖ్యంగా మధుమేహంలో..!

కొబ్బరిలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 100 గ్రాముల పచ్చి కొబ్బరిలో సుమారు 350 కిలోకేలరీల శక్తి ఉంది. పిండి పదార్థాలు, కొవ్వులు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు బాగా ఉన్న కొబ్బరిని తినడం వల్ల మేలే జరుగుతుంది. అయితే డయాబెటిస్‌తో బాధపడేవారు కొబ్బరి తినకూడదని అంటుంటారు. కానీ, నిజానికి డయాబెటిస్ ఉండటం వల్ల రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

పచ్చి కొబ్బరి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..? ముఖ్యంగా మధుమేహంలో..!
Coconut
Jyothi Gadda
|

Updated on: Feb 15, 2025 | 2:11 PM

Share

పచ్చికొబ్బరి ప్రయోజనాలు చాలా మందికి తెలియకపోవచ్చు.. కానీ, దీంతో శరీర ఆరోగ్యానికి బోలెడన్నీ లాభాలు అంటున్నారు పోషకాహార నిపుణులు. పచ్చి కొబ్బరిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మనల్ని పలు రకాల రోగాలను నయం చేయడంలో దివ్యౌషధంగా పనిచేస్తాయని చెబుతున్నారు. పచ్చికొబ్బరి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చర్మ, జుట్టు సౌందర్యాన్ని పెంచుతుందని చెబుతున్నారు. ఇన్ని పోషకాలు కలిగిన కొబ్బరిని క్రమం తప్పకుండా మీ భోజనంలో చేర్చుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిక్‌లో అద్భుతమైన ఫలితాలనిస్తుందని చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కొబ్బరిలోని ఐరన్, కాల్షియం, ఫైబర్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, ఫాస్పరస్, సెలీనియంతో పాటు ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 100 గ్రాముల పచ్చి కొబ్బరిలో సుమారు 350 కిలోకేలరీల శక్తి ఉంది. పిండి పదార్థాలు, కొవ్వులు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు బాగా ఉన్న కొబ్బరిని తినడం వల్ల మేలే జరుగుతుంది. అయితే డయాబెటిస్‌తో బాధపడేవారు కొబ్బరి తినకూడదని అంటుంటారు. కానీ, నిజానికి డయాబెటిస్ ఉండటం వల్ల రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

అటువంటి పరిస్థితిలో రక్తంలో చక్కెరను జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. ఆరోగ్యానికి మేలు చేసే కొబ్బరి డయాబెటిక్ రోగులు కూడా తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ పరిమిత పరిమాణంలో మాత్రమే తింటే మంచిదని అంటున్నారు. కొబ్బరిలోని మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCTలు) రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. కొబ్బరికాయలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీనిని పరిమిత పరిమాణంలో తినాలని నిపుణులు అంటున్నారు. అయితే మధుమేహ రోగులు కొబ్బరిని తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..