AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాక్కూడా పెళ్లి చేసుకుంటారా..? ఈ ప్రేమ జంట పెట్టిన షరతులు చూస్తే బిత్తరపోవాల్సిందే..

ఇకపోతే, ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏంటంటే..ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే.. మూడు నెలల పాటు బట్టలు ఉతకాలని, టాయిలెట్లు శుభ్రం చేయాలని, ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకురావాలని రాసుకున్నారు. ఈ ఫన్నీ అగ్రిమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు ఓ రేంజ్‌లో రియాక్షన్స్‌ ఇస్తున్నారు.

ఇలాక్కూడా పెళ్లి చేసుకుంటారా..? ఈ ప్రేమ జంట పెట్టిన షరతులు చూస్తే బిత్తరపోవాల్సిందే..
Valentine Agreement
Jyothi Gadda
|

Updated on: Feb 15, 2025 | 1:58 PM

Share

ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రేమలో ఉన్నవారు తమ ప్రియమైన వారికి తమ జీవితాంతం గుర్తుండిపోయే బహుమతులు ఇచ్చి సంతోషపెడుతుంటారు. హ్యాపీగా వాలెంటైన్స్‌ డే వేడుకలు జరుపుకుంటారు. ఇక, ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. కొందరు టూర్లు వెళ్తుంటారు. మరికొందరు సినిమాలు, షీకార్లు, విందులు ఏర్పాటు చేసుకుంటారు. అయితే, ఇక్కడో ప్రేమ జంట చేసుకున్న పెళ్లి అగ్రిమెంట్‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ అగ్నిమెంట్‌లో వారు చేసుకున్న ఒప్పందాలు సర్వత్రా షాక్‌ అయ్యేలా చేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

వైరల్‌ అపశ్చిమ బెంగాల్‌కు చెందిన అనయ, శుభమ్ అనే దంపతులు పెళ్లయిన రెండేళ్ల తర్వాత ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఒప్పంద పత్రం రాసుకున్నారు. రూ.500 బాండ్ పేపర్‌పై అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇందులో అనయ, భర్త శుభమ్‌కు కొన్ని షరతులు విధించింది.

ఇవి కూడా చదవండి

భార్య పెట్టిన షరతులు ఏంటంటే..

– భోజనం చేసేటపుడు కుటుంబ సంబంధ విషయాలు మాత్రమే మాట్లాడాలి. ట్రేడింగ్ గురించి మాట్లాడకూడదు.

– బెడ్రూమ్‌లో స్టాక్ మార్కెట్ లాభాలు, నష్టాల గురించి మాట్లాడకూడదు.

– నన్ను బ్యూటీ కాయిన్, క్రిప్టో పై అని పిలవడం మానెయ్యాలి

– రాత్రి 9 గంటల తర్వాత ట్రేడింగ్‌కు సంబంధించిన యాప్స్, వీడియోలు చూడకూడదు అని షరతులు విధించింది.

అలాగే, భర్త శుభమ్ కూడా భార్యకు కొన్ని కండీషన్స్‌ పెట్టాడు…

– శుభమ్ ప్రవర్తన గురించి అమ్మకు ఫిర్యాదు చేయడం అనయ మానాలి.

– వాదన సమయంలో శుభమ్ మాజీ ప్రేయసి ప్రస్తావన తీసుకురాకూడదు.

– ఖరీదైన స్కిన్ కేర్ ఉత్పత్తులు కొనకూడదు

– స్విగ్గీ, జొమాటో నుంచి రాత్రి పూట ఫుడ్ ఆర్డర్ చేయకూడదు అంటూ భార్యకు భర్తకు నిబంధనలు విధించాడు.

ఇకపోతే, ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏంటంటే..ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే.. మూడు నెలల పాటు బట్టలు ఉతకాలని, టాయిలెట్లు శుభ్రం చేయాలని, ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకురావాలని రాసుకున్నారు. ఈ ఫన్నీ అగ్రిమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు ఓ రేంజ్‌లో రియాక్షన్స్‌ ఇస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..