వారెవ్వా ఆడాళ్లా మజాకా..? మందు తాగే మహిళలు ఈ రాష్ట్రంలోనే ఎక్కువట.. ఆసక్తికరమైన సర్వే
ఆడ మగా తేడా లేకుండా ఎక్కువగా మద్యం సేవిస్తున్నారనే విషయం గురించి మీరు ఎప్పుడైనా చర్చించి ఉండకపోవచ్చు..కానీ, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఒక సర్వే ద్వారా వెలువడ్డాయి. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన సర్వే ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం వెల్లడించింది. ఆ సర్వే రిపోర్ట్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆ సర్వే పూర్తి వివరాల్లోకి వెళితే..

దేశంలో ఏ రాష్ట్రం అత్యధికంగా మద్యం వినియోగిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఏ రాష్ట్రంలో ఆడ మగా తేడా లేకుండా ఎక్కువగా మద్యం సేవిస్తున్నారనే విషయం గురించి మీరు ఎప్పుడైనా చర్చించి ఉండకపోవచ్చు..కానీ, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఒక సర్వే ద్వారా వెలువడ్డాయి. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన సర్వే ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం వెల్లడించింది. ఆ సర్వే రిపోర్ట్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆ సర్వే పూర్తి వివరాల్లోకి వెళితే..
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన సర్వేలో భారతదేశంలోని ఈశాన్య ప్రావిన్స్ రాష్ట్రాలు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయని వెల్లడైంది. సర్వే ప్రకారం, ఇక్కడి మహిళలు ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు.
ఈ సర్వే ప్రకారం, అస్సాంలో మద్యం సేవించే మహిళల నిష్పత్తి అత్యధికంగా ఉంది. దేశంలో 15-49 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో సగటు మద్యపానం 1.2 శాతం ఉండగా, అస్సాంలో ఈ సగటు 16.5 శాతానికి దగ్గరగా ఉంది. అస్సాం తర్వాత, మేఘాలయ ఈ జాబితాలో చోటు దక్కించుకుంది, ఇక్కడ 8.7 శాతం మహిళలు మద్యం తాగుతున్నారు. ఈ జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ మూడవ స్థానంలో నిలిచింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




