AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Updates: ఆధార్‌లో ఈ వివరాలు ఒక్కసారి మాత్రమే అప్‌డేట్‌ చేసేందుకు అవకాశం.. అదేంటో తెలుసా..?

Aadhaar Card: నేడు ప్రతి పనికి ఆధార్ కార్డు అవసరం అవుతుంది. ఒక్క ఆధార్ నెంబర్ తో మన చిరునామాతో పాటు.. మనకు సంబంధించిన ఎన్నో వివరాలు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. అయితే ఈ ఆధార్ కార్డు ఓ వ్యక్తి జీవితంలో ఒకసారి మాత్రమే పొందడం సాధ్యమవుతుంది..

Aadhaar Updates: ఆధార్‌లో ఈ వివరాలు ఒక్కసారి మాత్రమే అప్‌డేట్‌ చేసేందుకు అవకాశం.. అదేంటో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Feb 16, 2025 | 3:19 PM

Share

ఆధార్‌ కార్డు.. ఇది ప్రతి ఒక్కరికి ఒక ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ఆధార్‌ లేనిది ఏ పని జరగని పరిస్థితి ఉంది. సిమ్‌ కార్డు మొదలు విమాన టికెట్‌ వరకు అన్నింటికీ ఆధార్‌ కార్డ్ ఉండాల్సిందే. దీంతో ఎటు వెళ్లినా జేబులో ఆధార్‌ కార్డ్‌ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అడ్రస్‌ మారినా, ఇంటి పేరు మార్చుకోవాలనుకున్నా, ఫోన్‌ నెంబర్‌ అప్‌డేట్ చేసుకోవాలనుకున్నా ఆధార్‌ అప్‌డేట్ చేసుకోవాల్సిందే. అయితే ఆధార్‌ కార్డులో ఏ వివరాలను ఎన్ని సార్లు మార్చుకునే అవకాశం ఉంటుందో మీకు తెలుసా..? అందుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆధార్‌లో ఉప్పుడు పడితే అప్పుడు వివరాలను అప్‌డేట్‌ చేసుకునేందుకు వీలుండదు. కొన్ని వివరాలు మాత్రమే చాలా సార్లు అప్‌డేట్‌ చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. కొన్ని వివరాలు మాత్రం ఒక్కసారి మాత్రమే అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

  1. ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీని ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు మార్చుకోవడం కుదరదు. కేవలం ఒక్కసారి మాత్రమే పేరు మార్చుకునే అవకాశం ఉంటుందని గుర్తించుకోండి. ఒకవేళ ఏదైనా సరైన కారణం ఉంటే మినహాయింపు ఇస్తారు. ఒకవేళ రెండోసారి పుట్టిన తేదీని మార్చాల్సి వస్తే.. యూఐడీఏఐ జాబితా ప్రకారం చెల్లుబాటు అయ్యే రుజువుతో ఏదైనా ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి. ఇందుకు సంబంధించి ఏవైనా అనుమానాలు, సందేహాలు ఉంటే స్థానికంగా ఉన్న ఆధార్‌ సెంటర్‌ లేదా 1947 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేయాలి.
  2. ఇక ఆధార్‌ కార్డులో ఫొటోను ఎన్నిసార్లైనా మార్చుకునే అవకాశం ఉంది. స్థానికంగా ఉన్న ఆధార్‌ ఎన్‌రోల్‌ సెంటర్‌కు వెళ్లి మీ ఫొటో, వేలి ముద్రలు వంటి వాటి ఆధారంగా ఫొటోలను ఎన్నిసార్లైనా మార్చుకునే అవాకశం ఉంటుందని గుర్తించుకోండి.
  3. ఇక ఆధార్‌ కార్డులో అడ్రస్‌ను ఎన్నిసార్లైనా మార్చుకునే వెసులుబాటు కల్పించారు. అడ్రస్‌ మార్పునకు ఎలాంటి పరిమితి లేదు. ఆధార్‌ సెంటర్‌లో సంబంధించిన డాక్యుమెంట్స్‌ని అందించడం ద్వారా ఆధార్‌లో అడ్రస్‌ను మార్చుకోవచ్చు.
  4. ఆధార్‌ కార్డులో జెండర్‌ను ఒక్కసారి మాత్రమే అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం, అవసరమైన డాక్యుమెంట్స్‌ను అందించడం ద్వారా జెండర్‌ అప్‌డేట్‌ను మరోసారి అప్‌డేట్ చేసుకోవచ్చు.
  5. ఆధార్‌ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి సాధారణంగా.. పాస్‌పోర్ట్, కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థ, రెగ్యులేటరీ బోర్డు జారీ చేసిన సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డు, ఫ్రీడం ఫైటర్ ఫోటో ఐడెంటిటీ కార్డు, టెన్త్ సర్టిఫికెట్‌, టాన్స్‌జెండర్ ఐడెంటిటీ కార్డు, బర్త్‌ సర్టిఫికేట్‌ వంటి సర్టిఫికెట్స్‌ అవసరపడతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
vasant panchami: ఇంట్లో సరస్వతి దేవిని ఎలా పూజించాలో తెలుసా?
vasant panchami: ఇంట్లో సరస్వతి దేవిని ఎలా పూజించాలో తెలుసా?
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం