AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. 18 మంది మృతి.. ఎటు చూసినా భయానక పరిస్థితి..

ఈ తొక్కిసలాటలో15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలిసింది. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. క్షణగాత్రులను సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. కానీ, మృతుల వివరాలపై రైల్వేశాఖ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఘటనపై మాత్రం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. తొక్కిసలాటలో మరణాలు చోటుచేసుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ధ్రువీకరించారు.

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. 18 మంది మృతి.. ఎటు చూసినా భయానక పరిస్థితి..
Delhi Railway Station
Jyothi Gadda
|

Updated on: Feb 16, 2025 | 2:04 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉన్నట్టుండి కలకలం రేగింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల మధ్య ఊహించని విధంగా తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలిసింది. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. క్షణగాత్రులను సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. కానీ, మృతుల వివరాలపై రైల్వేశాఖ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. తొక్కిలాసట క్రమంలో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో పరిస్థితి భయానకంగా మారింది. ప్లాట్ ఫామ్ పై ప్రయాణికులు చెల్లా చెదురుగా పడివున్న దృశ్యాలు హృదయవిధారకంగా కనిపించాయి. ఆ వీడియో వైరల్ అవుతున్నాయి.

ఘటనపై మాత్రం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. తొక్కిసలాటలో మరణాలు చోటుచేసుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ధ్రువీకరించారు.

తొక్కిసలాటలో మరణాలు చోటుచేసుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ధ్రువీకరించారు.

తొక్కిసలాట నేపథ్యంలో రద్దీని నివారించేందుకు నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. అనూహ్య రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు వెల్లడించారు.

అటు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు.

14వ నంబరు ప్లాట్‌ఫాంపై ప్రయాగ్‌రాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచి ఉండడంతో మహా కుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడకు చేరుకున్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నంబరు ప్లాట్‌ఫాంలపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసినట్లు భావిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. గత నెలలో ప్రారంభమైన కుంభమేళా ఈ నెల 26న ముగియనుంది. కుంభమేళా ముగింపు దగ్గరపడుతున్న క్రమంలో ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానాల కోసం జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే అటు ప్రయాగ్ రాజ్ లోనే కాకుండా ప్రయాగ్ రాజ్ కు దారి తీసే రహదారులు, రైల్వే లైన్లు, విమాన సర్వీసులు సైతం రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ప్రయాగ్ రాజ్ వెళ్లేందుకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో నెలకొన్న రద్దీ కారణంగానే ప్రయాణికుల మధ్య తోపులాట జరిగిందని సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే