షాకింగ్ న్యూస్.! మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే.?
బంగారం ధరలు రోజు రోజుకూ అంబరాన్నంటుతున్నాయి. మరో నెలలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో పసిడి కొనుగోలుకు ఎక్కువ మంది మక్కువ చూపిస్తారు. అయితే ఏం కొనేటట్లు లేదు అన్నట్లుగా తయారైంది పసడి ధరలు. చూడటానికే కాదు కొనేందుకు వెళితే కూడా జిగేల్ మంటున్నాయి. నిన్నమొన్నటి వరకు స్వల్పంగా తగ్గిన పసిడి ఈరోజు మరోసారి పెరిగింది.
బంగారం ధరలు రోజు రోజుకూ అంబరాన్నంటుతున్నాయి. మరో నెలలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో పసిడి కొనుగోలుకు ఎక్కువ మంది మక్కువ చూపిస్తారు. అయితే ఏం కొనేటట్లు లేదు అన్నట్లుగా తయారైంది పసడి ధరలు. చూడటానికే కాదు కొనేందుకు వెళితే కూడా జిగేల్ మంటున్నాయి. నిన్నమొన్నటి వరకు స్వల్పంగా తగ్గిన పసిడి ఈరోజు మరోసారి పెరిగింది. దీనికి కారణం అంతర్జాతీయ అర్థిక స్థితిగతుల్లో నెలకొన్న మార్పులే అంటున్నారు నిపుణులు. దీనికి తోడూ డాలర్ విలువలో వచ్చిన హెచ్చుతగ్గులు, స్టాక్ మార్కెట్ల ప్రభావం, ప్రపంచ దేశాల్లో కొనసాగుతున్న యుద్ద పరిస్థితులు అన్ని వెరసి పసిడి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.
ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 24క్యారెట్ల 10 గ్రాముల స్పచ్ఛమైన బంగారం ధర రూ. 74,350గా కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 68,160కి చేరుకుంది. కిలో వెండి ధర కూడా నిన్న మొన్నటి వరకు రూ. 90 వేల మార్క్ చేరింది. ప్రస్తుతం కేజీ వెండి ధరపై రూ. 100 తగ్గి రూ. 89,900వద్ద కొనసాగుతోంది. ఇక దేశ వ్యాప్తంగా పలు ప్రధాన ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు..
- హైదరాబాద్ – రూ. 74,350
- విజయవాడ – రూ. 74,350
- చెన్నై – రూ. 75,170
- ముంబై – రూ.74,350
- బెంగళూరు – రూ.74,350
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు..
- హైదరాబాద్ – రూ. 68,160
- విజయవాడ – రూ. 68,160
- చెన్నై – రూ. 68,910
- ముంబై – రూ. 68,160
- బెంగళూరు – రూ. 68,160
కిలో వెండి ధరలు..
- హైదరాబాద్ – రూ. 89,900
- విజయవాడ – రూ. 89,900
- చెన్నై – రూ. 89,900
- ముంబై – రూ. 86,400
- బెంగళూరు – రూ. 85,900